NTV Telugu Site icon

KeerthySuresh : కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి ఫోటోలు..

ప్రముఖ నటి కీర్తి సురేష్ తాను ప్రేమించిన చిన్న నాటి స్నేహితుడు ఆంటోనీని నేడు వివాహమాడింది.   గోవాలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్  జరిగింది.

 

కాలేజీ రోజుల నుండి ప్రేమించుకుంటున్న కీర్తి ఆంటోనీ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో, వేద పండితుల సాక్షిగా హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకున్న ఆనందంలో కీర్తి ఆనందంలో మునిగి తేలుతుంది కీర్తి సురేష్.

 

ఈ ఏడాది దీపావళి కానుకగా తమ ప్రేమను మీడియాతో పంచుకుంది కీర్తి సురేష్. అయితే కీర్తి చేస్తున్న సినిమాల షూటింగ్స్ ను ఫినిష్ చేసి ఆంటోనీని వివాహం చేసుకుని కొద్దీ రోజులు సినిమాలకు గ్యాప్ ఇచ్చి వైవాహిక జీవితాన్నీ ఆనందంగా గడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారట ఈ జంట

 

ఓ శుభ ముహూర్తాన కీర్తి మేడలో మూడు ముళ్ళు వేసిన ఆంటోనీని చూస్తూ.. నీతోనే ఈ ప్రయాణం.. నీవే నా గమ్యం అన్నట్టు చూస్తున్న కీర్తి జంటను చుస్తే ఎంత చూడముచ్చటగా ఉందొ.

 

ఈ వివాహానికి సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు, హీరోయిన్స్ తో పాటు వివిధ రంగాలకు చెందిన   ప్రముఖులు హాజరయి నూతన దంపతులను ఆశీర్వదించారు.

Show comments