విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ రిలీజ్ ‘కింగ్‌డమ్’. భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. వరుస ప్లాప్స్ తో సతమత మవుతున్న విజయ్ కు ఈ విజయం ఎంతో కీలకం.
జూలై 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘కింగ్‌డమ్’ పై విజయ్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. రిలీజ్ అయిన మొదటి సాలిడ్ స్టార్ట్ అందుకుంది కింగ్‌డమ్. ఓవర్సీస్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది. మొదటి రోజు ఏకంగా రూ. 39 కోట్లతో భారీ ఓపెనింగ్ రాబట్టింది. ఇక కింగ్‌డమ్ కు పోటీ లేదనుకున్నారు. కానీ సినిమా సెకండాఫ్ పై వచ్చిన మిశ్రమ స్పందన కలెక్షన్స్ పై కాస్త ఎఫెక్ట్ చూపించింది. రెండవ రోజు కూడా స్ట్రాంగ్ హోల్డ్ చేసిన కింగ్‌డమ్ శని, ఆదివారం కాస్త నెమ్మదించింది. అనూహ్యంగా కన్నడ చిత్రమైన మహావతార్ నరసింహ భారీ వసూళ్లు రాబట్టి కింగ్‌డమ్ ను వెనక్కినెట్టి కలెక్షన్స్ కు గండి కొట్టింది. ఇప్పటి వరకు అయితే థియేట్రీకల్ రైట్స్ లో మూడొంతులలో రెండు వంతులు రాబట్టింది. ఇప్పడు ఉన్న ట్రెండ్ ప్రకారం టోటల్ రన్ ముగిసేనాటికి నైజాం క్లీన్ హిట్ అవగా రాయలసీమ, ఆంధ్రలోను డిస్ట్రిబ్యూటర్స్ కొంత మేర నష్టాలు చూసి అవకాశం ఉండొచ్చు. జిఎస్టీలు వెనక్కు ఇవ్వాల్సి రావొచ్చు. బ్లాక్ బస్టర్ కొట్టి బౌన్స్ బ్యాక్ అవ్వాలనుకున్న విజయ్ కు ఈ సినిమా కూడా పూర్తి స్థాయి సక్సెస్ ఇవ్వలేదనిట్రేడ్ లో వినిపిస్తున్న మాట.
