మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ మూవీ ‘వార్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఈ రెండో భాగంగా తారక్ హృతిక్ తలపడనున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్ 2 గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ మూవీ అప్ డేట్ కోసం తారక్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. అదిరిపోయే వీడియోను విడుదల చేశారు. మొత్తనికి ఆగస్ట్ 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.