Site icon NTV Telugu

War 2 & Coolie : నార్త్‌లో వార్ 2కి.. ‘కూలీ’ గట్టి షాక్..!

War 2 Vs Coolie

War 2 Vs Coolie

ఈ ఆగస్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘వార్ 2’, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తుండగా, మరోవైపు ‘కూలీ’ పేరుతో భారీ మల్టీస్టారర్‌ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్‌లు నటించగా. ఇప్పటికే ఈ క్లాష్‌ పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా నార్త్ మార్కెట్‌లో హిందీ చిత్రాలకే ఎక్కువ స్క్రీన్ షేర్ దక్కుతుంటుంది. కానీ..

Also Read : Rajinikanth : భాషా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్.. కానీ !

ఈసారి మాత్రం ‘కూలీ’ సినిమా కూడా అక్కడ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటిటి డీల్‌ను 8 వారాల తర్వాత మాత్రమే తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేయడంతో, హిందీ మార్కెట్‌లోని నేషనల్ చైన్స్, సింగిల్ స్క్రీన్లు కూడా ‘కూలీ’కి మొగ్గు చూపుతున్నాయి. అది వర్కౌట్ అయితే, నార్త్ ఆడియెన్స్ నుంచే కాకుండా బాలీవుడ్ ట్రేడ్ నుంచి కూడా ‘కూలీ’ కి పెద్ద ఆదరణ దక్కే అవకాశముంది. దీంతో వార్ 2 vs కూలీ అనేది ఆగస్టు నెలలో సౌత్ మాత్రమే కాదు, నార్త్ లో కూడా భారీ బాక్సాఫీస్ పోరుగా మారబోతోంది. సౌత్ ఇండియాలో అయితే ఈ రెండు సినిమాల మధ్య థియేట్రికల్ క్లాష్ తప్పదని ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ మార్కెట్‌లో ఎన్టీఆర్ సినిమాలంటే మాస్ ఫాలోయింగ్ ఉంటే, రజినీకాంత్, నాగ్ కాంబినేషన్‌కు కూడా ఫ్యామిలీ, క్లాస్ ఆడియెన్స్ నుంచి బలమైన క్రేజ్ ఉంది. మరి బాలీవుడ్ లో నిగేది ఎవ్వరో చూడాలి.

Exit mobile version