Site icon NTV Telugu

War 2 : ‘వార్ 2’ మూవీ ఫస్ట్ లుక్ పై ఇంట్రెస్టింగ్ బజ్.. !

War 2

War 2

బాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న భారీ చిత్రాలో ‘వార్ 2’ ఒకటి. ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ఈ మోస్ట్ వాంటెడ్ మల్టీస్టారర్ మూవీ ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి విడుదల కాడోతుంది.  అయాన్ ముఖేర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్నాఈ చిత్రం 90% చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉందట. ఇక ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌ కలయిక అనగానే ఆడియన్స్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఇప్పటిదాకా సినిమాకు సంబంధించిన ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ విడుదల చేయలేదు. దీంతో తారక్ లుక్ ఎలా ఉండబోతోంది? హృతిక్ ఎలా కనిపిస్తారు? అని ఇరువురి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేసే ఓ క్రేజీ న్యూస్ ఇకటి వైరల్ అవుతోంది..

Also Read : Samantha : కష్టానికి తగిన పారితోషికం ఇవ్వడం లేదు..

‘వార్ 2’ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారట. మే నెల మొదటి వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ పాత్రలకు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ రివిల్ చేసే అవకాశం ఉందని బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరు హీరోలో తారక్ లుక్ ఎక్స్ట్రార్డినరీ గా ఉండబోతుందని చెబుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అవుతుంది. దీంతో అభిమానులు అధికారికంగా ప్రకటన ఇవ్వాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Exit mobile version