Site icon NTV Telugu

Jr. NTR : వార్ 2 ఈవెంట్ సూపర్ సక్సెస్.. కానీ ఎన్టీఆర్ క్షమాపణలు

Jrntr

Jrntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన భారీ ముల్టీస్టారర్ వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో  కలిసి నటిస్తున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న ఈ సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.

Also Read : Tollywood : సినీ కార్మికుల 8వ రోజు సమ్మె అప్డేట్.. అవి కూడా బంద్

ఈ నేపధ్యంలో ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, దర్శకులు త్రివిక్రమ్ నిర్మాత దిల్ రాజు హాజరయ్యారు. తన సూపర్ సెన్సషనల్ స్పీచ్ తో ఫ్యాన్స్ కు జోష్ నింపాడు ఎన్టీఆర్. ఇప్పటిదాకా ప్రమోషన్స్ సరిగా చేయడం లేదనుకున్న అభిమానులకు కావాల్సినంత హై ఇచ్చాడు తారక్. ‘వార్-2′ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం యంగ్ టైగర్ NTR క్షమాపణలు కోరుతూ Xలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ’ ‘ఇందాక ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. నన్ను క్షమించాలి. ఈవెంట్ సజావుగా జరిగేందుకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. CM రేవంత్ గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన సపోర్టుకు నా పాదాభివందనాలు. ఎంతో బాధ్యతతో ఫ్యాన్స్ ఆనందానికి కారణమయ్యారు’ అని వ్యాఖ్యానించారు.

 

 

Exit mobile version