NTV Telugu Site icon

Wamiqa : ప్లాప్ హీరోయిన్ చేతిలో ఆరు సినిమాలు

Wamiqa

Wamiqa

ఓ ప్లాప్ హీరోయిన్  రష్మికను తలదన్నే లైనప్ తో అదరగొడుతూ దాదాపు పదేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తున్న భామామణి సైడ్ రోల్స్ నుండి హీరోయిన్‌గా ఆ బ్యూటీ వామికా గబ్బీ. ప్రెజెంట్ వన్ ఆఫ్ ది బిజియెస్ట్ హీరోయిన్ గా స్టార్ హీరోయిన్ను మించిపోయిన లైనప్స్ సెట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఎండింగ్‌లో వచ్చిన బేబీ జాన్ బాక్సాఫీస్ బాంబ్ గా మారినప్పటికీ వామికా ఆఫర్లకు కొదవలేదు. స్టార్ బ్యూటీ, నేషనల్ క్రష్ రష్మికను మించిపోయేలా ఆఫర్లను దక్కించుకుంటూ ఐదు ఇండస్ట్రీలను చుట్టేస్తోంది.

Also Read : Pushpa 2 : ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్న పుష్ప -2..?

జబ్ వి మెట్ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన పంజాబీ గుడియా పంజాబీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ స్పెషల్ ఐడెంటిటీని తెచ్చుకుంది. 2015లో వచ్చిన భలే మంచి రోజుతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు దాదాపు 10 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్ధమైంది. అడివి శేష్ హిట్ మూవీ గూఢచారి సీక్వెల్లో కన్ఫమ్ అయ్యింది. రీసెంట్లీ ఆమె ఎంట్రీని ఎనౌన్స్ చేశారు మేకర్స్. ప్రజెంట్ వామికా గబ్బీ చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయి. కిక్లీ పంజాబీ మూవీతో పాటు జీని, ఇరవాకలం తమిళ్ మూవీస్, తెలుగులో గూఢచారీ 2, దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్ బాలీవుడ్ ప్రొడక్ట్, మలయాళ మూవీ టికీ టాకాలో యాక్ట్ చేస్తుంది. ఇలా ఐదు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది బ్యూటీ. మరీ ఈ సారైనా టాలీవుడ్ లో హిట్ రీసౌండ్ వింటుందో రానున్న రోజుల్లో తెలుస్తుంది.