Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వాల్తేరు వీరయ్య'(Waltair Veerayya). బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాసుతో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా నటిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రాబోతోంది. గతంలో ఒక చిన్న గ్లిమ్ప్స్ తో వాల్తేరు వీరయ్య సినిమాలో చిరు మాస్ మూల విరాట్ గా కనిపిస్తాడు అనే హింట్ ఇచ్చిన చిత్ర యూనిట్, ఇప్పుడు బాస్ పార్టీ అనే సాంగ్ ప్రోమోని విడుదల చేశారు(Boss Party Promo Song). వెల్కం టు ది బిగ్గెస్ట్ పార్టీ, బాస్ పార్టీ అంటూ మొదలిన ఈ ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్ మైక్ అందుకోని… “నువ్వు లుంగీ ఎత్తుకో, నువ్వు షర్ట్ ముడేసుకో, నువ్వు కర్చీఫ్ కట్టుకో, బాస్ వస్తుండు” అంటూ చిరుకి ఎలివేషన్స్ ఇచ్చాడు. లిరిక్స్ ఎండ్ అయ్యే టైంకి చిరు, లుంగీ కట్టి బీడీ పట్టి గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇస్తున్న విజువల్ అదిరిపోయింది. ఈ సాంగ్ లిరిక్స్ కూడా దేవినే రాయడం విశేషం. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన ఈ బాస్ పార్టీ సాంగ్ చిరు ఫాన్స్ కి స్పెషల్ ట్రీట్ అయ్యే ఛాన్స్ ఉంది.
Read also: 41st Convocation Of SSSIHL Live: సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవం లైవ్
నవంబర్ 23 సాయంత్రం 04:05 నిమిషాలకి బాస్ పార్టీ ఫుల్ సాంగ్ ని విడుదల చేయనున్నారు. అయితే సాంగ్ ప్రోమో వింటుంటే ‘రెబో రెబో’ అనే ఇంగ్లీష్ సాంగ్ గుర్తొచ్చేలా ఉంది. పవన్ కళ్యాణ్ నటించిన ‘కెమెరామాన్ గంగతో రాంబాబు’ సినిమాలోని ‘మెలికల్ తిరుగుతుంటే అమ్మాయో’ సాంగ్ ‘రెబో రెబో’ నుంచి ఇన్స్పైర్ అయ్యి చేసిన పాటనే. ఇప్పుడు బాస్ పార్టీ ప్రోమో కూడా ఆ పాటనే గుర్తు చేస్తోంది. మరి ఈ పోలిక స్టార్టింగ్ లో వస్తున్న దేవి శ్రీ ప్రసాద్ హమ్మింగ్ వరకే వరకే ఉంటుందా? లేక ఫుల్ సాంగ్ అలానే ఉంటుందా అనేది చూడాలి.
