NTV Telugu Site icon

VT15 : సూపర్ ఫన్ ప్రోమోతో అదరగొట్టిన మేకర్స్..!

Varun Tej (3)

Varun Tej (3)

మెగా హీరో వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో కొరియన్ హారర్ కామెడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘మట్కా’ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న వరుణ్ ఈసారి డిఫరెంట్ జానర్‌లో రాబోతున్నాడు. తెలుగు తెరపై ఇప్పటి వరకు చూడని విధంగా కొరియా బ్యాక్‌డ్రాప్‌లో, హారర్ కామెడీతో ఈ మూవీని తీస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీలో, వరుణ్‌కు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి అధికారికంగా ఎలాంటి టైటిల్ అనౌన్స్ చేయనప్పటికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ట్రెండ్ అవుతోంది. అయితే అప్పుడే టీం ప్రమోషన్ స్టార్ట్ చేశారు.. అదేంటి అనుకుంటున్నారా.

Also Read: Nani : ‘ది ప్యారడైజ్’ నుండి మరో పోస్టర్ రిలీజ్..

తాజాగా ఈ మూవీకి సంబంధించి అనౌన్స్‌మెంట్ వీడియోను.. చిత్ర బృందం డిఫరెంట్‌గా వదిలింది. ఈ వీడియోలో రాత్రివేళ కమిడియన్ సత్య కారులో వరుణ్ తేజ్ ఆఫీసుకి వెళ్లగా రూమ్ అంతా చీకటిగా ఉంది. వరుణ్ డిప్రెషన్‌తో చీకట్లో కూర్చున్నాడేమోనని పొరపాటు పడిన సత్య, మోటివేషన్ ఇచ్చేలా పెద్ద పెద్ద డైలాగులతో రెచ్చిపోతాడు. ఇంతలో కరెంట్ రావడంతో అసలు సంగతి తెలిసి తనే షాక్ తింటాడు. ఆ తర్వాత ఇద్దరూ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉండగా, డైరెక్టర్ వచ్చాడు.. ఇందులో సత్య కూడా ఉన్నాడు అనడంతో.. సత్య తనకు కథ వినిపించమరి కోరుతాడు. దీంతో ఓ కొరియన్ అమ్మాయి ప్రత్యక్షం అయ్యి సత్యకి కథ గురించి చెబుతూ ఉంటుంది. అయితే చివర్లో కరెంట్ పోవడం తో సత్యకి ఎవరో మసాజ్ చేస్తారు. చేతులు వేసి తాము కాదని మిగిలిన ముగ్గురు చెప్పడంతో సత్య హడలిపోతాడు. ప్రజంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

&nbsp