Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vrushakarma: అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు డైరెక్షన్లో వస్తున్న మిస్టిక్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అసలు ‘వృషకర్మ’ అంటే అర్థం ఏంటనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాగచైతన్య, మీనాక్షి చౌదరి, డైరెక్టర్ కార్తీక్ దండు, నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ బిగ్‌బాస్ స్టేజ్‌పై సందడి చేశారు. ఈ సందర్భంగా హోస్ట్ అక్కినేని నాగార్జున.. డైరెక్టర్ కార్తీక్ దండును నేరుగా ‘వృషకర్మ’ టైటిల్ అర్థం ఏంటని అడిగారు. దీనికి కార్తీక్ సమాధానమిస్తూ.. “యుగధర్మాన్ని నిలబెట్టడానికి ప్రతి యుగంలోనూ ఒక్కడు మళ్లీ తిరిగి వస్తాడు.. అదే ‘వృషకర్మ’ అసలు అర్థం” అని రివీల్ చేశారు.
డైరెక్టర్ చెప్పిన ఆన్సర్ విన్న వెంటనే నాగార్జున తనదైన స్టైల్లో స్పందించారు. “మరి మీ సినిమాలో ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఎవరు వచ్చారు?” అని డైరెక్టర్ని అడగ్గా.. కార్తీక్ దండు మాట్లాడుతూ ‘అర్జున్’ వచ్చాడని చెప్పారు. దానికి నాగార్జున స్పందిస్తూ.. “చై అన్నమాట! నా పేరులో సగం తీసేసుకున్నావ్ అన్నమాట అర్జున్ అని!” అంటూ నవ్వుతూ పంచ్ వేశారు. దీంతో ఈ సినిమాలో నాగచైతన్య పాత్ర పేరు ‘అర్జున్’ అని, యుగధర్మాన్ని కాపాడే ఆ కీలక రోల్లోనే చైతూ కనిపించనున్నాడని అఫిషియల్‌గా బయటపడింది. మొత్తానికి బిగ్‌బాస్ వేదికపై ‘వృషకర్మ’ టైటిల్ అర్థంతో పాటు చైతూ పాత్ర పేరు కూడా రివీల్ అవ్వడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి డిసెంబర్ 4న రాబోతున్న ఈ సినిమా వెండి తెరపై ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.
Also Read
- Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
- కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
- Chaitanya Reddy: ‘హనుమాన్’ ఎవరి సొంతం కాదు.. మా దగ్గరా డాక్యుమెంట్స్ ఉన్నాయి!
- Renu Desai: ఆడవాళ్లేమీ రోబోలు కాదు.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు!
తాజావార్తలు
-
Vrushakarma టైటిల్‌కు అసలు అర్థం చెప్పిన డైరెక్టర్.. సినిమాలో చైతూ పాత్ర ఇదేనట!
-
Eyeglass Lens Scratches : కళ్లద్దాలను చొక్కాతో తుడుస్తున్నారా?.. ఈ తప్పు అస్సలు చేయొద్దు.!
-
Satvika Veeravalli vs Afiya Syed: ‘కల్పన’ క్రేజ్‌కు ‘రుక్మిణి’ చెక్ పెడుతుందా?
-
Flight: విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో భూకంపం.. గాల్లోకే తిరిగి వెళ్లిపోయిన ఫ్లైట్..
-
కార్తీ ‘HIT 4’ స్క్రిప్ట్ రెడీ అయిపోయిందట! నాని గ్రీన్ సిగ్నల్ కోసం వెయిటింగ్..
ట్రెండింగ్
-
BSNL బంపర్ ఆఫర్..! ఆ రీఛార్జ్‌తో రూ. లక్ష బీమా ఫ్రీ..! రూ. 10 వేల సైబర్ బీమా కూడానూ..
-
MS Dhoni: ‘7’ నంబర్‌పై ధోనీ షాకింగ్ కామెంట్స్.. దాని వెనుక లాజిక్ ఇదే అంటూ..!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!