Vrushakarma Release Update: ‘వృషకర్మ’ కీలక అప్‌డేట్.. ప్రభాస్‌ను ఢీకొట్టబోతున్న నాగ చైతన్య?

Vrushakarma Release Update

Vrushakarma Release Update

Vrushakarma Release Date Update: అక్కినేని నాగ చైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న మిస్టికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, సుకుమార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ కీలక అప్‌డేట్ ఇచ్చారు. వృషకర్మ మూవీ విడుదల తేదీని ఈరోజు సాయంత్రం ప్రకటించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇప్పటికే వృషకర్మను డిసెంబర్‌లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. రెబల్ స్టార్ ప్రభాస్‌ను నాగ చైతన్య ఢీకొట్టనున్నాడు. డిసెంబర్ 3న ‘ఫౌజీ’ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో బాక్సాఫీస్ పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. ఫౌజీ, వృషకర్మ సినిమాల రిలీజ్ డేట్స్‌పై ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చ మొదలైంది.

వృషకర్మలో జయరామ్‌తో పాటు ‘లాపతా లేడీస్’ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో నటిస్తున్నారు. స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. ఆయన ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ మిస్టిక్‌ హారర్‌ థ్రిల్లర్‌లో నాగ చైతన్య నిధి అన్వేషకుడిగా కనిపించనున్నాడు. విరూపాక్షతో హారర్, మిస్టరీ జానర్‌లో తనదైన ముద్ర వేసిన కార్తీక్ దండు.. వృషకర్మతో ఎలాంటి థ్రిల్‌ను అందిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. మరి ఈరోజు సాయంత్రం మేకర్స్ ప్రకటించబోయే రిలీజ్ డేట్ ఏంటో చూడాలి.