NTV Telugu Site icon

ViswamTeaser : విశ్వంతో శ్రీనువైట్ల విశ్వరూపం చూపిస్తాడు : గోపించంద్

Untitled Design (22)

Untitled Design (22)

డైరెక్టర్ శ్రీను వైట్ల కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను డీల్ చేయడంలో ఎక్స్‌ పర్ట్. ముఖ్యంగా కామెడీని హ్యాండిల్ చేయడంలో దిట్ట. మాచో హీరో గోపీచంద్ తో శ్రీను వైట్ల రూపొందిస్తున్న స్టైలిష్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’. ప్రమోషన్స్‌ను కిక్ స్టార్ట్ చేస్తూ మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు.

టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. విశ్వ ప్రసాద్ గారికి థాంక్ యూ. ఆయన లేకపోతే ఈ సినిమా ఇంత స్మూత్ గా అయ్యేది కాదు. శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను. వన్ ఇయర్ బ్యాక్ ఆయన్ని ఓ పార్టీలో కలవడం, సినిమా చేద్దామని అనుకోవడం, అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయ్యింది. నేను చాలా మంది డైరెక్టర్స్ తో వర్క్ చేశాను. శ్రీను వైట్ల గారు కంఫర్ట్ బుల్, హీరో డైరెక్టర్. హీరోని ఎలా చూపించాలనే కంప్లీట్ క్లారిటీ వున్న డైరెక్టర్. ఈ జర్నీ చాల ఎంజాయ్ చేశాను. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది. సినిమా చాలా బావొచ్చింది. ఒక మంచి ఎంటర్ టైనర్ చేయాలని అనుకున్నాను. శ్రీను గారు అందులో మాస్టర్. ఇంత పెద్ద స్కేల్ లో ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేంలో నవ్వు వస్తునే వుంటుంది. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. కావ్య చాలా బాగా చేసింది. చేతన్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. గోపి మోహన్ నా లక్ష్యం, లౌక్యం తర్వాత మళ్ళీ ఈ సినిమాకి పని చేశారు. టీం అంతా చాలా హార్డ్ వర్క్ చేశాం. ఈ సినిమా డెఫినెట్ గా మంచి హిట్ అవుతుందనే నమ్మకం వుంది’ అన్నారు. అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల కానుంది గోపించంద్  విశ్వం.

Show comments