Site icon NTV Telugu

Vishwambhara: టీజర్ దింపుతున్నారు.. గెట్ రెడీ బోయ్స్!

Vishwambhara Teaser

Vishwambhara Teaser

Vishwambhara Teaser to be Released ok August 22nd: మెగాస్టార్ చిరంజీవి హైలీ యాంటిసిపేటెడ్ క్రేజీ సోషియో-ఫాంటసీ ఎంటర్టైనర్ ‘విశ్వంభర’ సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుందన్న సంగతి తెలిసిందే. ఆ రిలీజ్ డేట్ కోసం చాలా కేర్ తీసుకుంటున్న సినిమా యూనిట్ షెడ్యూల్ ప్రకారం సినిమాకు సంబంధించిన పనులు జరిగేలా చూసుకుంటోంది. ఈ మధ్యనే మేకర్స్ సినిమా డబ్బింగ్ పనులు మొదలుపెట్టారు. ఈ సినిమాలో అత్యున్నత స్థాయి వీఎఫ్‌ఎక్స్ ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి తగినంత సమయం పడుతుంది కాబట్టి ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఏకకాలంలో చేస్తున్నారు. ఇక తాజాగా చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఒక టీజర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, హనుమాన్ కి గొప్ప భక్తుడిగా కనిపించనున్నారు.

CM Revanth Reddy: కొత్త పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్.. లక్ష రూపాయల ఆర్థిక సహాయం

యాక్షన్ సీక్వెన్స్‌లు అద్భుతంగా ఉండబోతున్నాయని మేకర్స్ చెబుతున్నారు. దర్శకుడు వశిష్ట సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బ్లాక్‌బస్టర్ ప్రొడక్షన్ హౌస్ UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. విశ్వంభర సినిమాలో త్రిష కృష్ణన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కునాల్ కపూర్ పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాను విక్రమ్, వంశీ, ప్రమోద్ ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్‌గా నిర్మిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందించగా, ప్రముఖ డీవోపీ చోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్న ఈ విశ్వంభర 2025 జనవరి 10న విడుదల కానుంది.

Exit mobile version