Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?

Release Dates

Release Dates

ఈ ఏడాది రావాల్సిన ఎన్టీఆర్ డ్రాగన్ 2027 జూన్ 11 న రిలీజ్ అవుతుంది. మార్చి 19, జూన్ 4న రావాల్సిన టాక్సిక్ ఎట్టకేలకు ఆగస్టు 26న ముహూర్తం చూసుకుంది. షూటింగ్ పూర్తయినా జైలర్ 2 రిలీజ్ డేట్ రాలేదని సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫీల్ అయితే, అక్టోబర్ 15న వస్తున్నామని అనౌన్స్ చేశారు. సమ్మర్ లో రావాల్సిన వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ అక్టోబర్ సెకండ్ న రిలీజ్ అవుతుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. చాలా పెద్ద సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వచ్చినా.. విశ్వంభర, స్వయంభూ ఎప్పుడు వస్తాయో తెలియడం లేదు.

విఎఫ్ఎక్స్ (VFX) బాగా రాలేదని ఏడాది నుంచి విశ్వంభరాను చెక్కుతూనే ఉన్నారు. సిజి (CG) వర్క్ ఓ కొలిక్కి వచ్చిందన్న టాక్ వచ్చినా, రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించడం లేదు. ఓటిటీ కాకుండా సినిమాని రిలీజ్ చేయలేరు, ఈ రూల్ అన్ని పెద్ద సినిమాలకి వర్తిస్తుంది. మరోవైపు బడ్జెట్ ఏమో 400 కోట్లు దాటిపోయింది, ఇంత బడ్జెట్ థియేటర్స్ లో భర్తీ చేయడం కష్టం. ఫ్యాన్సీ రేట్ ఇచ్చి ఓటిటీ ముందుకు వచ్చే వరకు విశ్వంభరా బయటికి రావడం కష్టమే. నిఖిల్ నటించిన పీరియాడిక్ డ్రామా స్వయంభూ కూడా ఓవర్ బడ్జెట్ సమస్యని ఫేస్ చేస్తోంది, బడ్జెట్ 100 కోట్లు దాటిపోయింది. దీనికి తగ్గట్లే ఓటిటి రైట్స్ వస్తాయని ఆశిస్తున్నారు మేకర్స్. ఓవర్ బడ్జెట్ సినిమా రిలీజ్ పై ఎఫెక్ట్ చూపిస్తోంది. విరూపాక్షతో హిట్ కొట్టిన కార్తీక్ దండు, నాగచైతన్యతో ‘వృషకర్మ’ తీస్తున్నాడు. భారీ సెట్స్ వేసి సినిమా తీయడంతో బడ్జెట్ దాదాపు 100 కోట్లకు చేరింది. థియేట్రికల్ రైట్స్ తీసుకోవడానికి జీ (ZEE) సంస్థ ముందుకు రావడంతో, త్వరలో రిలీజ్ డేట్ కు నోచుకోనుంది.