NTV Telugu Site icon

VishwakSen: విశ్వక్ సేన్ నెక్స్ట్ మూవీ అప్డేట్ వచ్చేసింది..

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా, చాందిని చౌదరి హీరోయిన్ గా , విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గామి’ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీలో విశ్వక్ సేన్ అఘోర అనే క్యారెక్టర్ ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు.ఇక ఈ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. త్వరలోనే గామి సినిమా ఓటీటీలోకి రానుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ కానుండగా ఆయన తరువాత నటించబోయే మూవీ టైటిల్ ని మూవీ మేకర్స్ అనౌన్స్ చేసారు.

Also Read: Prathinidhi 2 Teaser: పొలిటికల్ కంటెంట్ తో ప్రతినిధి 2 టీజర్‌..!

నేడు విశ్వక్ బర్త్ డే కావడంతో తాను చేయబోయే నెక్స్ట్ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చింది. SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా “మెకానిక్ రాకీ ” సినిమా తెరకెక్కుతుంది. ఇక మెకానిక్ రాకీ మూవీ లవ్, కామెడీ జానర్ లో ఉండబోతుందని ఇదివరకు ఎప్పుడు చూడని క్యారెక్టర్ చేస్తున్నాడని సమాచారం. అలానే ఇవాళ సాయంత్రం 4 గం. 5 ని. లకు షైన్ స్క్రీన్స్ సంస్థ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్ గా నిర్వహించనున్న ఈ మూవీ యొక్క టైటిల్ అనౌన్స్ మెంట్ రానుంది. ఇప్పటికే మూవీ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటోంది. కాగా ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా  మూవీ మేకర్స్  రివీల్ చేయనున్నారు.

Show comments