Site icon NTV Telugu

VishwakSen : ‘కల్ట్’ చూపిస్తానంటోన్న విశ్వక్ సేన్..

Vishwaksen

Vishwaksen

మాస్ క దాస్ విశ్వ‌క్ సేన్ ‘లైలా’ డిజాస్టర్ తో కాస్త డిజప్పోయింట్ అయ్యాడు. దాంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి కథలు వినేపనిలో ఉన్నాడు.విశ్వక్ సేన్ ఇప్పుడు చేయబోయే సినిమాల పట్ల ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఈ సారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు విశ్వక్ సేన్. బూతు, వల్గారిటీ లేకుండా ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తున్నాడు విశ్వక్. అందులో భాగంగా జాతి రత్నాలు దర్శకుడు కెవి అనుదీప్ తో ఫంకీ అనే చేస్తున్నాడు. సితార ఎంటెర్టైన్మెట్స్ బ్యానర్ పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

Also Read : Kollywood : ఇంగ్లీష్ టైటిల్స్ ను సెంటిమెంట్ గా మార్చుకున్న యంగ్ హీరో

ఓ వైపు ఇతర కథలు వింటూనే తానే ఓ కథను రాసాడు. కథ రాయడమే కాకుండా తానే దర్శకత్వ భాద్యతలు స్వీకరించాడు విశ్వక్. ఈ సినిమాకు కల్ట్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసాడు. నేడు ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. ఈ వేడుకకు నిర్మాతలు అల్లు అరవింద్, హారిక, హాసిని చినబాబు హాజరయ్యారు. నేటి నుండి ఈ సినిమా షూటింగ్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేసారు. తారక్ సినిమాస్ తో పాటు వణ్మయి క్రియేటిన్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విశ్వక్ సేన్ ముఖ్య పాత్రలో నటిస్తూనే 40 మంది నూతన నటీనటులను టాలీవుడ్ కు పరిచయం చేయబోతున్నాడు. అలాగే మరొక టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఈ సినిమాకు మాటలు అందిస్తున్నాడు. తెలుగు, జాపనీస్, ఇంగ్లీష్, స్పానిష్, హిందీ భాషలలో ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.

Exit mobile version