సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్సేన్ అతి తక్కువ సమయంలోనే హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయన ఫిబ్రవరి 14వ తేదీన లైలా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నట్టు ప్రకటించాడు. అయితే కెరీర్ ముందు నుంచి విశ్వక్సేన్ నందమూరి హీరోలు ఎన్టీఆర్ తో పాటు బాలకృష్ణతో చాలా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆయన మెగాస్టార్ చిరంజీవిని తన సినిమా ఈవెంట్ కి ఆహ్వానించడంతో విశ్వక్సేన్ నందమూరి కాంపౌండ్ నుంచి మెగా కాంపౌండ్ కి జంప్ అయ్యాడా అనే ప్రశ్న ఈ ఈవెంట్ కి హాజరైన జర్నలిస్టుల నుంచి ఎదురైంది.
Laila : బూతే బూతు కానీ నవ్వుల ట్రీట్.. లైలా ట్రైలర్ చూశారా?
దానికి విశ్వక్సేన్ ఆసక్తికరంగా స్పందించాడు. తనకు ఇండస్ట్రీలో అందరూ కావాల్సిన వారే అని అంటూ అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో ఇంకా చాలామంది హీరోలు కూడా తనను సపోర్ట్ చేస్తారని తనను ఇలా గేట్లు వేసి కట్టేయవద్దు అంటూ ఆయన తనను ఒక కాంపౌండ్ కి పరిమితం చేయవద్దు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చాడు. తనకు నందమూరి హీరోలు ఎంత సపోర్ట్ చేస్తారో అందరికీ తెలిసిందేనని అన్నాడు ఈ సినిమాకి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించామని ఆయన సపోర్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నారని చెప్పుకొచ్చాడు. అయితే అసలు విషయం ఏమిటంటే అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న సినిమా ఇప్పుడు లైలా నిర్మాత సాహు గారపాటి షైన్ స్క్రీన్స్ బ్యానర్ లోనే తెరకెక్కుతోంది. ఆ పరిచయంతో మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించగా దానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ వేదికగా ఈ ఈవెంట్ జరగబోతోంది.