NTV Telugu Site icon

Vishnu : ‘కన్నప్ప’నుంచి రానున్న రెండో పాట..ఎప్పుడంటే?

Kannappa

Kannappa

టాలీవుడ్ నుంచి విడుదలకు సిద్ధంగా ఉన్న పాన్ ఇండియా చిత్రాల్లో ‘కన్నప్ప’ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ప్రెస్టీజియస్‌గా డైరెక్ట్ చేస్తున్నా ఈ చిత్రంలో భక్త కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. డా.మోహన్ బాబు అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నఈ పాన్ ఇండియా మూవీలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏప్రిల్ 25న గ్రాండ్ రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి, ఇప్పటికే విడుదలైన పోస్టర్స్,ఫస్ట్ సింగిల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతో విశేషంగా ఆకట్టుకోగా. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచేసింది. అయితే తాజాగా మరో కొత్త అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్.

Also Read: Prabhas : ‘ది రాజా సాబ్’ రిలీజ్ లేట్‌కి అదే కారణమా..?

ఎంటా అప్ డేట్ అంటే ఈ మూవీ నుండి లవ్ సాంగ్‌ను రెండో పాటగా మార్చి 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కన్నప్ప జీవితంలో భక్తితో పాటు ప్రేమ కూడా ఉందని.. అది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపెట్టబోతున్నామని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘శివ శివ శంకరా’ సాంగ్ ఎలాగైతే హిట్ అయ్యిందో, ఈ లవ్ సాంగ్ కూడా అందరినీ ఆకట్టుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తుంది.