Site icon NTV Telugu

Manchu Manoj : ‘ఆవేశం’ రీమేక్ చేయాలనుకున్న..

Vishnu Manchu, Aavesham

Vishnu Manchu, Aavesham

పౌరాణిక ఇతిహాసంగా రూపొందుతున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ  సినిమాతో విష్ణు మంచు సినీ ప్రపంచంలో ఒక విశిష్ట స్థానం కోసం అడుగులు వేస్తున్నారు. శివుని భక్తుడైన కన్నప్ప జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రంలో మోహన్ బాబు, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ వంటి మహానటులతో పాటు ప్రభాస్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. ఈ భారీ ప్రాజెక్టు ను దేశవ్యాప్తంగా జనాలకు చేరవేయడానికి విష్ణు అన్ని విధాలుగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ప్రత్యేకంగా కొచ్చిలో ట్రైలర్ లాంచ్ చేయడం, మోహన్ లాల్‌ను ప్రచారంలో భాగంగా చేర్చడం తెలివైన వ్యూహంగా నిలిచింది. ఈ ఘటన కేరళలో చర్చనీయాంశంగా మారింది.

Also Read : Peddi : డిజిటల్ రైట్స్ డీల్‌తో సంచలనం సృష్టించిన ‘పెద్ది’..

అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు, మలయాళ సినీ పరిశ్రమపై తనకున్న ప్రేమను వ్యక్తం చేశారు.. ‘మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి లెజెండ్స్ సినిమాలను ఎప్పుడూ మిస్ అవను. ఫహద్ ఫాసిల్ నటించిన ‘ట్రాన్స్’ సినిమాలో ఆయన నటన నన్ను ఎంతగానో ఆకట్టుకుందా. ఇక అలాగే, 2024 లో విడుదలై భారీ విజయాన్ని సాధించిన ఫహద్ ఫాసిల్ చిత్రం ‘ఆవేశం’ కూడా చాలా బాగుంటుంది. తెలుగులో ఈ సినిమాను రీమేక్ చేయాలనుకున్నాను. కానీ, అప్పటికే ఇతరులు హక్కులు తీసేశారు’ అని అన్నారు. అతని మాటల్లో ఆ సినిమాపై ఉన్న అభిమానంతో పాటు, దాన్ని తెలుగులోకి తీసుకురాలేక పోయిన బాధ స్పష్టంగా కనిపించింది.

Exit mobile version