Site icon NTV Telugu

Rathnam : ఓటీటీలోకి వచ్చేస్తున్న విశాల్ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Whatsapp Image 2024 05 07 At 8.31.59 Am

Whatsapp Image 2024 05 07 At 8.31.59 Am

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ రత్నం.మాస్ డైరెక్టర్ హరి రత్నం సినిమాకు దర్శకత్వం వహించారు.జీ స్టుడియోస్ బ్యానర్ పై కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించగా ప్రియా భవానీశంకర్ విశాల్ సరసన హీరోయిన్ గా నటించింది.ఈ సినిమాలో సముద్రఖని, విజయ్ కుమార్, మురళీ శర్మ మరియు యోగిబాబు వంటి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.దర్శకుడు హరి గతంలో విశాల్ తో భరణి ,పూజ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కించారు .దీనితో రత్నం సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగాయి.

రత్నం సినిమా ఏప్రిల్ 26 న తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమా ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి. అదిరిపోయే ట్విస్ట్‌లతో,మాస్ యాక్షన్ సీన్స్ తో విశాల్ రత్నం సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తున్న విశాల్ రత్నం మూవీ అప్పుడే ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చేందుకు సిద్ధం అయింది. రత్నం డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంత చేసుకుంది.విశాల్ రత్నం సినిమాకు ఓటిటి డీల్ బాగానే జరిగింది.ఈ నేపథ్యంలో మే 24 నుంచే విశాల్ రత్నం ను ఓటీటీలోకి తీసుకురానున్నట్లు సమాచారం. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రత్నం మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Exit mobile version