ప్రముఖ కోలీవుడ్ హీరో విశాల్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిశారు. అయితే ఈ సమావేశానికి గల కారణం ఏంటో తెలియరాలేదు. కానీ ఉపరాష్ట్రపతిని కలిసినట్టు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. “నా సోదరితో పాటు గౌరవనీయులైన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కలిసాను. ఆయనతో కలిసి కొంత క్వాలిటీ టైం ను స్పెండ్ చేయడం సంతోషంగా ఉంది. ఆయనతో పలు విషయాల గురించి చర్చించాము. ఆయనతో మాట్లాడిన టాపిక్స్ లో నాకు ఇష్టమైన సామాజిక సేవ కూడా ఉంది. దేవుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి” అంటూ విశాల్ ట్వీట్ చేశాడు.
Read Also : ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”
సమావేశం తరువాత విశాల్ కు వెంకయ్య కనెక్టింగ్. కమ్యూనికేటింగ్, ఛేంజింగ్ అనే పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. అయితే ఈ మీటింగ్ వెనుక అసలు కారణం ఏమై ఉంటుందా ? అనే విషయం గురించే అంతా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ ఎనిమీ, డిటెక్టివ్ 2 చిత్రాలతో బిజీగా ఉన్నారు.
