ట్రెండింగ్ లో రవితేజ “రామారావు ఆన్ డ్యూటీ”

మాస్ మహారాజా రవితేజ 68 చిత్రం టైటిల్ ను ప్రకటిస్తూ మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి “రామారావు ఆన్ డ్యూటీ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ పోస్టర్ లో రవితేజ సింపుల్ ఉన్నప్పటికీ చాలా కూల్ గా, స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. హాఫ్ స్లీవ్స్ ఉన్న షర్ట్, సన్ గ్లాసెస్ ధరించిన రవితేజను చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ప్రభుత్వ అధికారిగా నటిస్తున్నట్టు అన్పిస్తోంది. “రామారావు ఆన్ డ్యూటీ” పోస్టర్ కు సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది. ప్రస్తుతం “రామారావు ఆన్ డ్యూటీ”లోని రవితేజ లుక్ ట్రెండ్ అవుతోంది.

Read Also : అదిరిపోయిన “ఏజెంట్” లుక్.. షూటింగ్ అప్డేట్

ఈ మూవీని సుధాకర్ చెరుకూరి ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీంవర్క్స్ బ్యానర్ ల పై నిర్మిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే “రామారావు ఆన్ డ్యూటీ” నిజమైన సంఘటనల నుండి ప్రేరణ పొందిన కథతో రూపొందుతున్న ప్రత్యేకమైన థ్రిల్లర్. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. దివ్యన్షా కౌశిక్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పుడు హీరోహీరోయిన్లపై ముఖ్యమైన సన్నివేశాలను బృందం చిత్రీకరిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం సామ్ సిఎస్ అందిస్తున్నారు. “రామారావు”లో నాజర్, నరేష్, పవిత్ర లోకేష్, రాహుల్ రామ కృష్ణ, ఈ రోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు నటించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-