Vishal: తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన తన విద్యాభ్యాసం, కాలేజీ రోజులు, సినీ రంగంలోకి రావడానికి దారితీసిన పరిస్థితుల గురించిన విషయాలను పంచుకున్నారు. తాను చదువుకునే రోజుల్లో టాపర్‌ను కాదని, సగటు విద్యార్థినేనని చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. తాను బ్యాక్‌బెంచర్‌గా ఉండేవాడినని విశాల్ తెలిపారు. “మా బ్యాక్‌బెంచ్ బ్యాచ్‌లో ఒకరు మాజీ డిప్యూటీ సీఎం, మరొకరు మాజీ విద్యాశాఖ మంత్రి. ఇక నేను నటుడిగా మారాను. మా బ్యాచ్‌లోని ముగ్గురం కూడా బ్యాక్‌బెంచర్లమే” అని విశాల్ సరదాగా చెప్పుకొచ్చారు. అయితే బ్యాక్‌బెంచ్‌లో కూర్చోవడం వెనుక ఓ కారణం కూడా ఉందని సరదాగా చెప్పారు. తాను బాయ్స్ స్కూల్‌లో చదువుకున్నానని, ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు టీచర్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాక్‌బెంచ్ అనుకూలంగా ఉండేదని నవ్వుతూ పేర్కొన్నారు.
‘‘నేను చెడ్డ విద్యార్థిని కాదు.. అలాగని అద్భుతమైన విద్యార్థిని కూడా కాదు. సగటు విద్యార్థిని. 12వ తరగతిలో చివరి రోజు వరకు ప్రశ్నపత్రం కోసం ప్రయత్నించాను. అది దొరకకపోవడంతో చివరికి చదివి పరీక్ష రాశాను. 75 శాతం మార్కులు వచ్చాయి’’ అని విశాల్ చెప్పుకొచ్చారు. తన చిన్ననాటి నుంచి జీవితంలో ఎన్నో మార్గాలు ఉన్నాయని తెలిపారు. తండ్రి తనను అథ్లెట్‌గా చూడాలనుకున్నారని, అయితే ఓ సినిమా చూసిన తర్వాత దర్శకుడు కావాలనే ఆలోచన తనలో బలపడిందని చెప్పారు. తాను దర్శకుడిని కావాలనుకుంటున్నానని తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారని గుర్తు చేసుకున్నారు. కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలను కూడా విశాల్ గుర్తుచేసుకున్నారు. ఆ రోజుల్లో ఎదురైన అనుభవాలన్నీ మనల్ని తీర్చిదిద్దడంలో భాగమేనని అన్నారు. ‘‘ఆ క్షణాలను కోల్పోతే కాలేజీ జీవితంలో మిగిలేది ఏమీ ఉండదు’’ అని పేర్కొన్నారు. తన తండ్రి నుంచి సానుకూలంగా ఆలోచించడం, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉండటం వంటి విషయాలను నేర్చుకున్నానని విశాల్ తెలిపారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.

