NTV Telugu Site icon

Rathnam : ఓటిటీలోకి వచ్చేసిన విశాల్ యాక్షన్ మూవీ ‘రత్నం’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Rathnam

Rathnam

Rathnam : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ “రత్నం”.మాస్ డైరెక్టర్ హరి ఈ సినిమాను తెరకెక్కించారు.హరి ,విశాల్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భరణి ,పూజ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.అయితే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ రత్నం.ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటించింది.ఈ యాక్షన్ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు.యోగిబాబు, సముద్రఖని ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

Read Also :Prabhas : నాగ్ అశ్విన్ నన్ను 3 సంవత్సరాలు టార్చర్ పెట్టాడు..

ఈ సినిమా ఏప్రిల్ 26న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది.అయితే ఈ సినిమా కథ రొటీన్ గా ఉండటంతో ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.కానీ ఈ సినిమాలో విశాల్ నటన,దర్శకుడు హరి టేకింగ్‌ ప్రేక్షుకులను ఎంతగానో మెప్పించింది.థియేటర్ లో అంతగా మెప్పించని ఈ సినిమా తాజాగా ఓటిటిలో రిలీజైంది. ఈ యాక్షన్ మూవీ గురువారం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది.ఈ మూవీ తమిళ్ తో పాటు తెలుగు వెర్షన్ కూడా ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది.థియేటర్స్ లో అంతగా ఆకట్టుకొని ఈ యాక్షన్ మూవీ ఓటిటి ప్రేక్షకులని మెప్పిస్తుందో లేదో చూడాలి.

Show comments