Site icon NTV Telugu

బన్నీకి ఝలక్ ఇచ్చిన చెర్రీ సినిమా!

Vinaya Vidheya Rama and Ala Vaikuntapurramuloo Latest TRP Ratings

వెండితెరపై ఘన విజయం సాధించిన చిత్రాలకు బుల్లితెరలో టీఆర్పీ రావాలనే రూల్ ఏమీ లేదు. అలానే సిల్వర్ స్క్రీన్ మీద చతికిల పడినంత మాత్రాన ఆ సినిమాను టీవీలో స్క్రీనింగ్ చేసినప్పుడు పెద్దంత ఆదరణ లభించదని అనుకోవడానికీ లేదు. దీనికి తాజా ఉదాహరణగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సినిమాలను చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘వినయ విధేయ రామ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ సినిమాను వారి అంచనాలకు తగ్గట్టుగా తీయలేకపోయామని రామ్ చరణ్‌ సైతం ఆ తర్వాత సారీ చెప్పాడు. చిత్రం ఏమంటే… గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన ‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఒక విషయంలో ‘వినయ విధేయ రామ’ పోటీ పడుతోంది.

Read Also : సంతోష్ శోభన్ “అన్నీ మంచి శకునములే” మోషన్ పోస్టర్

ఇంతకూ విషయం ఏమంటే… ‘అల వైకుంఠపురములో’ సినిమా ఇటీవల నాలుగవ సారి టీవీ ఛానెల్ లో టెలికాస్ట్ అయ్యింది. అప్పుడు దానికి 4.98 టీఆర్పీ దక్కింది. ఇటీవల ‘వినయ విధేయ రామ’ సినిమా 19వ సారి టెలికాస్ట్ అయినప్పుడు 4.96 టీఆర్పీ పొందింది. అంటే దాదాపు గా ‘అల వైకుంఠపురములో’ సినిమా నాలుగవ స్క్రీనింగ్ టీఆర్పీ, ‘వినయ విధేయ రామ’ 19వ సారి స్క్రీనింగ్ టీఆర్పీ దాదాపు సమానం. ఒక రకంగా చూస్తే చెర్రీ సినిమాదే పై చేయి అనుకోవచ్చు.

Read Also : ముగ్గురు మొనగాళ్లు : “ఓ పిల్లా నీ వల్ల” వీడియో సాంగ్

నిజానికి బుల్లితెరలో బోయపాటి శ్రీను సినిమాలకంటే కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలే విశేష ఆదరణ పొందుతూ ఉంటాయి. అయితే… ‘అల వైకుంఠపురములో’ సినిమా విషయానికి వచ్చే సరికీ ఇది ఇప్పటికే 2020లో బ్లాక్ బస్టర్ గా నిలువడం, డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనూ అత్యధిక శాతం మంది దానిని చూడటంతో రిపీట్ టెలీకాస్ట్ టైమ్ లో టీవీలో పెద్దంతగా రేటింగ్ రాలేదని అంటున్నారు. అయితే ఒకటి మాత్రం వాస్తవం ‘అల వైకుంఠపురములో’ సినిమా తొలిసారి టీవీలో ప్రసారం అయినప్పుడు 29.4 టీఆర్పీ రాగా, ‘వినయ విధేయ రామ’కు 10 లోపు టీఆర్పీ దక్కింది.

Exit mobile version