హిట్లు, ఫ్లాపులకు సంబంధం లేకుండా సాగుతుంది చియాన్ విక్రమ్ కెరీర్. గతేడాది తంగలాన్ అనే సినిమాతో వచ్చాడు విక్రమ్. పా రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని విక్రమ్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి. కానీ కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించలేదు. ఇక విక్రమ్ నటించిన రెండు సినిమాలు షూటింగ్ ఫినిష్ చేసుకుని రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి ధ్రువ నక్షత్రం, మరోటి వీర ధీర సూరన్ – 2. ధ్రువ నక్షత్రం షూటింగ్ ఫినిష్ చేసుకుని మూడేళ్లు అవుతుంది కానీ విడుదలకు మాత్రం నోచుకోలేదు. ఇక వీర ధీర సూరన్ సినిమాది అటుఇటుగా అదే పరిస్థితి.
Also Read : Laila : ఓటీటీలోను అవుట్ రైట్ డిజాస్టర్ గా లైలా
యంగ్ డైరెక్టర్ ఎస్‌యు అరుణ్ కుమార్‌తో చేసిన ‘వీర ధీర సూరన్-2’ మొదట సంక్రాంతికి రిలీజ్ అని ప్రకటించారు. కానీ అక్కడ అనుకోని కారణాల వలన వాయిదా వేయాల్సి వచ్చింది. ఇలా అనేక సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎన్నో అడ్డంకులు దాటుకుని ఈ నెల 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ధర పలికింది. ఈ సినిమా రైట్స్ ను ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్ నాలుగు కోట్ల రూపాయలకు రైట్స్ కొనుగోలు చేసాడు. విక్రమ్ సినిమాకు ఈ రేట్ అంటే మంచి ధర అనే చెప్పాలి. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా వస్తోన్న వీర ధీర శూరన్‌లో దుషారా విజయన్ హీరోయిన్. ఎస్ జే సూర్య కీ రోల్ ప్లే చేస్తుండగా మాలీవుడ్ స్టార్ హీరో సూరజ్ వెంజరమూడు కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. జీవీ ప్రకాష్ స్వరాలు సమకూరుస్తున్నాడు.