మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ సినిమా లైలా. రామనారాయణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ సినిమాలో విశ్వక్ సేన్ లేడీ గెటప్‌లో కనిపించనుండడంతో రిలీజ్ కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రీమియర్స్ తో నేడు థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా తోలి తోలి ఆటకే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.
ఎంతలా అంటే 2025 లో విడుదలైన బిగ్గెస్ట్ డిజస్టర్ సినిమాలలో లైలా మొదటి స్థానాన్ని దక్కించుకున్నంత. కేవలం నాలుగు పాటలు, రొమాంటిక్ సీన్స్, భూతు డైలాగులు, హీరోయిన్స్ తో ఎక్స్ పోజింగ్ చూపిస్తే ఆడియెన్స్ చూసేస్టారు అనుకుంటే పొరపాటు అని మరోసారి సినిమా ప్రేక్షకులు నిరూపించారు. థియేటర్స్ లో దారుణమైన డిజాస్టర్ గా మిగిలిన లైలా ఇప్పుడు ఓటీటీలో వచ్చింది. ఈ కళాకండాన్ని ఈ నెల 7 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేసింది. అసభ్యకరమైన సీన్స్ ఎడిట్ ఏమి లేకుండా స్ట్రీమింగ్ చేసిన ఈ సినిమాలు నెటిజన్స్ కూడా తిప్పికొట్టారు. ఓటీటీలోను ఈ సినిమా దారుణమైన రిజల్ట్ చూసింది. ఎంతలా అంటే కనీసం ఇంట్రెస్టింగ్ వాచ్ లిస్ట్ లో కూడా లైలా సజెస్ట్ చేయలేనంత. అసలు ఈ సినిమా ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్‌లో కూడా లేదు. నార్మల్ గా ఏదైనా కొత్త సినిమా ఓటీటీ రిలీజ్ అయితే టాప్ 1లో కనీసం ఒక వారం పాటు ట్రెండ్ అవుతాయి. లైలా కనీసం లిస్ట్ లో కూడా లేదు.