Site icon NTV Telugu

96 Sequel : సేతుపతి అవుట్.. ప్రదీప్ ఇన్.. కానీ?

Vijay Sethupathi

Vijay Sethupathi

త్రిష సెకండ్ ఇన్నింగ్స్ ను స్ట్రాంగ్ చేసిన మూవీ 96. 2018లో వచ్చిన ఈ మూవీ డీసెంట్ హిట్. రామ్, జానుగా విజయ్ సేతుపతి, త్రిష నటనకు ఫిదా కాని వారు లేరు. ప్రేమ్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పలు భాషల్లో రీమేక్ చేసిన సంగతి విదితమే. కాగా, ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని రీసెంట్లీ ఎనౌన్స్ చేశారు మేకర్స్. వేల్స్ ప్రొడక్షన్ హౌస్.. భారీగా ప్లాన్ చేస్తుంది. అయితే ఇప్పుడో షాకింగ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అదే 96 సీక్వెల్ నుండి విజయ్ సేతుపతి క్విట్ అయ్యాడన్నది లేటెస్ట్ బజ్.

Also Read: Nidhhi Agerwal: పాపం నిధి.. అడుగు పడితే లేటే!

సెకండ్ పార్ట్ లో రామ్ జానును వెతుక్కుంటూ సింగపూర్ వెళ్లే స్టోరీని డిజైన్ చేసి మక్కల్ సెల్వన్ కు దర్శకుడు వినిపిస్తే నచ్చలేదని.. తనకు సెట్ కాదన్న ఉద్దేశంతో క్విట్ అయ్యాడని టాక్. ఇప్పుడు హీరో కోసం వెతుకులాటలో పడ్డాడట ప్రేమ్ కుమార్. సేతుపతి ప్లేసులోకి నయా సెన్సేషనల్ హీరో ప్రదీప్ రంగనాథ్ ను అప్రోచ్ అయ్యాడని బజ్. ఇదే నిజమేతే.. త్రిషకు ఈ యంగ్ హీరో మ్యాచ్ అవుతాడా..? రామ్ ప్లేసులో సేతుపతిని తప్ప మరో హీరోను ప్రేక్షకులు ఊహించగలరా..? రిసీవ్ చేసుకుంటారా..? ప్రదీప్ ఆ పాత్రకు న్యాయం చేయగలడా..? ప్రేమ్ కుమార్ ఇవన్నీ రీ కన్సిడర్ చేస్తేనే బెటర్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు

Exit mobile version