Site icon NTV Telugu

Dr.56: ప్రియమణి మూవీ పోస్టర్ ను ఆవిష్కరించిన మక్కల్ సెల్వన్

Priyamani

Priyamani

vijay sethupathi launches first look priyamani dr.56: జాతీయ ఉత్తమనటి ప్రియమణి ప్రస్తుతం ‘డాక్టర్ 56’ అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్‌ అందిస్తుండగా, రాజేష్‌ ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను ప్రవీణ్‌ రెడ్డి టి తెలుగువారి ముందుకు తీసుకొస్తున్నారు. దక్షిణాదిలోని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళంలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎ.ఎన్. బాలాజీ నిర్మించారు. ఇదే సంస్థతో ‘డాక్టర్ 56’తో పాటుగా, ప్రభుదేవా ‘ఫ్లాష్ బ్యాక్’, ‘వర ఐపీఎస్’, ‘ఛేజింగ్’ చిత్రాలను నిర్మిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాలన్నీ కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.

Read also: Hebah Patel: నవంబర్ లో ‘తెలిసిన వాళ్ళు’ రాబోతున్నారు!

తాజాగా ప్రియమణి ‘డాక్టర్ 56’కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఆవిష్కరించారు. నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రానికి డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మీ, జె. లక్ష్మణ్ పాటలు రాస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విక్రమ్ మోర్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. దీనికి భార్గవ్ రామ్ సంభాషణలు సమకూర్చగా, సినిమాటోగ్రఫీ బాధ్యతలను రాకేష్ సి తిలక్ స్వీకరించారు. ప్రియమణితో పాటు ప్రవీణ్, దీపక్ రాజ్‌ శెట్టి, రమేష్‌ భట్, యతిరాజ్, వీణా పొన్నప్ప, మంజునాథ్ హెగ్డే, స్వాతి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Monster Movie Banned Gulf Countries: గల్ఫ్ లో మోహన్ లాల్ సినిమాపై బ్యాన్

Exit mobile version