NTV Telugu Site icon

Vijay sethupathi : స్క్రిప్ట్ నచ్చితే చాలు.. డైరెక్టర్ గురించి పట్టించుకోను

Vijay Sedhupati

Vijay Sedhupati

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. హీరో అయినప్పటికి విలన్‌గా కూడా అదరగొడుతున్నాడు. చివరగా ‘మహారాజా’ తో తన 50వ సినిమాను పూర్తి చేసిన విజయ్, ఇప్పుడు తదుపరి ప్రాజెక్టులపై దృష్టిపెట్టాడు. ప్రజంట్ మూడు సినిమాలు పూర్తయ్యేవరకూ మరో రెండు-మూడు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేస్తున్నాడు. ఇందులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి. ఇక ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేని దర్శకుడు పూరితో.. మీరు సినిమా తీయడం ఏంటంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ హల్ చల్ చేశాయి. ఆయన స్క్రిప్ట్ ఎందుకు ఎంచుకున్నారంటూ విజయ్‌ను ట్యాగ్ చేస్తూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.. అయితే తాజాగా వీటిపై  విజయ్ సేతుపతి స్పందించాడు.

Also Read: Spirit : ఏం చేద్దామనుకుంటున్నారయ్యా.. ప్రభాస్ vs సూపర్‌స్టార్‌

‘నేను పూరి ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసినప్పటి నుండి చాలా రకాల మాటలు వినపడుతున్నాయి. అందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా.. నేను దర్శకుడి గతంలో చేసిన సినిమాలు, వాటి హిట్ ఫట్‌ల గురించి పట్టించుకోను. స్క్రిప్ట్ నచ్చితే చాలు. పూరి చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. అందుకే ఓకే చేశా. ఇలాంటి కథ ఇప్పటి వరకు చేయలేదు, వినలేదు కూడా. ముందు నుంచి కూడా నేను కొత్త వాటికి ఎప్పుడు ప్రాధాన్యమిస్తా. గతంలో చేసిన స్టోరీస్ రిపీట్ కాకుండా చూసుకుంటా. పూరి జగన్నాథ్‌ కథ చాలా బాగా నచ్చింది. ఈ మూవీ షూటింగ్ జూన్‌లో ప్రారంభం అవుతుంది’ అని విజయ్ వెల్లడించాడు విజయ్.