Site icon NTV Telugu

విజయ్ సేతుపతి భారీ విరాళం

Vijay Sethupathi contributed Rs 25 Lakhs to the Tamil Nadu Chief Minister's Relief fund

కరోనా సెకండ్ వేవ్ లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాలు పంచుకున్నారు. అందులో భాగంగానే కోలీవుడ్ స్టార్ హీరోలంతా తమవంతుగా భారీ విరాళాలను తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేశారు. తాజాగా ఈ జాబితాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేరిపోయారు. విజయ్ సేతుపతి ఈ రోజు తమిళనాడు ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్‌కు రూ. 25 లక్షలు విరాళంగా అందించారు. సేతుపతి టిఎన్ ముఖ్యమంత్రిని సెక్రటేరియట్ వద్ద కలిసి చెక్కును సమర్పించారు. ఇక ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్, సూర్య ఫ్యామిలీ, జయంరవి ఫ్యామిలీలతో పాటు పలువురు నటులు, అలాగే దర్శకులు కూడా ముఖ్యమంత్రి సహాయ నిధికి భారీగా విరాళాలు అందజేశారు.

Exit mobile version