Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ ఏ సినిమాలో నటించినా ఏదో ఒక మూమెంట్ వస్తుందని ట్రోలర్సే ప్రమోషన్స్ చేస్తున్నారు. హీరోను అన్ని రకాలుగా డీఫేమ్ చేస్తూ పోస్టులు పెడతారు. ఇది కొన్నేళ్లుగా సాగుతూనే ఉంది. రౌడీ హీరోపై ట్రోలర్స్ రెచ్చిపోవడంతో ఆ ఎఫెక్ట్ సినిమాపై పడి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ‘రణబాలి’ 16న రిలీజ్ అవుతోంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో విజయ్ పాల్గొన్నాడు. “మీరే ఎందుకు ట్రోల్ అవుతున్నారు?” అని అడిగితే గట్టిగా సమాధానం ఇచ్చాడు. “నా ఆత్మవిశ్వాసం వాడికి బలుపు అనిపిస్తే నేను తగ్గాలా?” అని ప్రశ్నించాడు. “నా జర్నీ వాడికి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా?” అంటూ ఘాటుగా స్పందించాడు. “నా కలలు, నా శ్రమ వానికి అనవసరం అనిపిస్తే నేను ఆగాలా? నా నిజాయితీ, నా హానెస్టీ వానికి అరోగెన్స్లా అనిపిస్తే నేను నటించాలా? నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నా మీద ఉన్న నాకు నమ్మకం వానికి బలుపులా అనిపిస్తే నేను తగ్గాలా? ఇప్పుడు నా జర్నీ వానికి అరగకపోతే నేను ఇంట్లో కూర్చోవాలా? నేను మారను, వాళ్ళు మారాలి” అని ట్రోలర్స్ తనను ఎలా ట్రోల్ చేస్తారో చెప్పుకొచ్చాడు విజయ్.
ఓ 50 మంది పనికట్టుకొని తనపై 50 రీల్స్ చేస్తారని, అవన్నీ ఒకేలా ఉంటాయని అన్నారు. నిజంగానే ట్రోల్ చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుందని, కానీ 50 రీల్స్ ఒకేలా ఎందుకు ఉంటాయి అని అన్నాడు. ఈ మధ్యకాలంలో నాని, కిరణ్ అబ్బవరం, సందీప్ కిషన్ తమపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించారని గుర్తుచేశాడు. “తెలుగు సినిమా అయినా అరే ‘రణబాలి’ కాదురా ‘జైలర్’ పోదాం, ఈ సినిమా బొక్క అని మీకు 50-60 రీల్లు వస్తాయి. ఒపీనియన్లు ఎప్పుడూ ఒక్కొక్కరికి డిఫరెంట్ డిఫరెంట్ ఒపీనియన్లు ఉంటాయి. మనం 50 రీల్లు ఒకే కమ్యూనికేషన్ చూస్తున్నామంటే ఎవడో కూర్చొని డబ్బులు పెట్టి బ్యాచ్‌లో కూర్చొని చేయిస్తుంది. ఈరోజు ప్రపంచం అట్లాంటిది. ఎందుకంటే ఇప్పుడు నేనే కాదు, మొన్న నాని అన్న మాట్లాడిండు, సందీప్ కిషన్ దీని గురించి మాట్లాడిండు, కిరణ్ అబ్బవరం మాట్లాడిండు. మనకి ఎక్కువ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక సేయింగ్ ఉంది… నువ్వు గన్ను పట్టుకో, నేను గన్ను పట్టుకో, మనం నెగోషియేట్ చేయొచ్చు. నువ్వు కత్తితో రా, నేను కత్తితో రా, మనం రూల్స్ మాట్లాడొచ్చు.”
Also Read
- Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
సోషల్ మీడియా వచ్చాక ఎవరూ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. చిరంజీవి ఫ్యాన్స్ బాలయ్యను, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రామచరణ్‌ను, రామచరణ్ ఫ్యాన్స్ బన్నీని… ఇలా హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడల్లా సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ యుద్ధమే జరుగుతోంది. కానీ వీళ్ళు ఇవేవీ పట్టించుకోకుండా తమ పనిఏంటో తాము చేసుకుంటూ ఉంటారు. బాలయ్య మీద వచ్చినంత ట్రోలింగ్ మరో హీరోపై రాలేదు. “బ్రదర్ ఐ డోంట్ కేర్” అంటూ ట్రోలింగ్ గురించి ఆలోచించేవాడే కాదు. ఇలా ఉండడానికి విజయ్ ఎందుకు ప్రయత్నించడు? విజయ్ దేవరకొండకు స్టార్ హోదా రాలేదనే బాధ ఎక్కువైపోయిందని అంటున్నారు. సినిమా ఫంక్షన్లలో వేరే వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడడం, అడ్డంగా ఇరుక్కుపోవడం కొన్నాళ్ళుగా కామన్ అయిపోయిందా? ఆటిట్యూడ్ చూపించి తన సినిమాను తనే చంపేసుకుంటున్నాడని అంటున్నారు. గట్టిగా 50 కోట్లు దాటని హీరో ఇలా ఇరగబడి నోరు పారేసుకోవడం కరెక్టేనా అంటున్నారు. వాపు, బలుపు అంటూ రౌడీ హీరోపై ఎక్కేస్తున్నారు స్టార్ హీరోల ఫ్యాన్స్.
‘లైగర్’ ఈవెంట్లో “ఏ తాత ఎవరో తెలియకపోయినా ఇంత అభిమానం చూపిస్తున్నారన్న” డైలాగ్ విజయ్ క్యాజువల్ గా అన్నాడా లేదా అన్న సంగతి పక్కన పెడితే, స్టార్స్‌ను ఉద్దేశించే అన్నాడన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడున్న స్టార్స్ అందరూ వారసత్వంగా వచ్చిన వాళ్ళే. చిరంజీవి తప్ప సీనియర్ హీరోలు బాలయ్య, నాగార్జున, వెంకటేష్ వారసత్వంగా ఎంట్రీ ఇచ్చారు. మహేష్, బన్నీ, రామచరణ్, ప్రభాస్ వారసత్వం కొనసాగించారు. స్పెసిఫిక్ గా ‘తాత’ అనడంతో అది తమ హీరోనే అన్నాడు అంటూ యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యి విజయ్ ను ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు. విజయ్ దేవరకొండ హిట్ కొట్టి ఎనిమిదేళ్ళు దాటింది. 2018లో వచ్చిన ‘టాక్సీవాలా’ తర్వాత కంటిన్యూస్‌గా ఆరు డిజాస్టర్స్ చూశాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా “నాకేంటి నేనింతే” అంటూ ప్రతిసారి స్టార్ హీరోలతో పోల్చుకుని దెబ్బ తింటూనే ఉన్నాడు. స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆడేసుకుంటూ పరువు తీస్తున్న రౌడీ హీరో మాత్రం మారలేదు. తిరుపతిలో జరిగిన ‘కింగ్డమ్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ “వెంకన్న స్వామి ఈ ఒక్కసారి పక్కనుండి నడిపిస్తే చాలా పెద్దోడిని అయిపోతాను, టాప్ లో కూర్చుంటాను” అన్నాడు. అంతవరకు బానే ఉంది, టాప్ హీరో అవాలనుకోవడంలో తప్పు లేదు. ఆ తర్వాతే ట్రాక్ తప్పి మాట్లాడాడు. “వెంకటేశ్వర స్వామి దయ, మీ అందరి ఆశీసులు ఉంటే ఏ నా కొడుకు మనల్ని ఆపేదేలే” ఈ మాటలే వివాదానికి దారి తీశాయి. ఆయన్ని ఎదగకుండా ఎవరు ఆపుతున్నారు? ఒకవేళ నిజంగానే ఆపారు అనుకుంటే వరుస ఆఫర్స్ ఎలా వస్తాయి? ‘కింగ్డమ్’ సెట్స్‌పై ఉండగానే రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి.
విజయ్ నటించిన సినిమాల్లో ‘గీత గోవిందం’ ఒక్కటే 50 కోట్ల షేర్ దాటింది. అయినా ఈ కుర్ర హీరోపై నిర్మాతలు 70-100 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నారు. విజయ్ వ్యాఖ్యలు నిజం చేయాలంటే ఆయనతో సినిమాలు తీయడం ఆపేయాలా అంటూ ఫిలిం వర్గాల్లో చర్చ మొదలైంది. ‘లైగర్’ విషయంలో బాక్స్ ఆఫీస్ నుంచి ఎలాంటి ఫిగర్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చని చార్మి అడిగితే 200 కోట్లతో మొదలవుతుందని, ఎక్కడ ఆగుతుందో తెలియదన్న నమ్మకంతో చెప్పాడు విజయ్. ఏ హీరో ఇంతవరకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేస్తానని ఎప్పుడూ చెప్పలేదు. రాజమౌళి లాంటి దర్శకుడే కలెక్షన్ల రికార్డుల గురించి మాట్లాడడు. విజయ్ కు ఆటిట్యూడ్ ఎక్కువ అంటూ నెటిజన్లు ఇందుకు విమర్శిస్తున్నారు. రౌడీ హీరో మాటలు వింటుంటే వెంటనే స్టార్ అయిపోవాలి, 100 కాదు, 200 కాదు, 300 కోట్ల హీరో అనిపించుకోవాలన్న ఫీలింగ్‌లో బలంగా ఉంది అనిపిస్తుంది. ‘లైగర్’ 200 కోట్లతో మొదలవుతుందన్న విజయ్ పై ట్రోలర్స్ దాడి చేశారు. ‘ఫ్యామిలీ స్టార్’ ఈవెంట్లో ఇదే విషయాన్ని విజయ్ ప్రస్తావిస్తూ “200 కోట్లు కొడతా అని స్టేట్మెంట్ ఇవ్వడం తప్పు కాదు, చెప్పి కొట్టకపోవడమే తప్పు” అన్నాడు. “నా మీద నాకు నమ్మకం ఉందని, ఎప్పటికైనా 200 కోట్లు కొడతాను” అంటూ మరోసారి ధీమా వ్యక్తం చేశాడు విజయ్.
‘ఫ్యామిలీ స్టార్’ గ్లింప్స్‌లో “ఐరన్ ఏ వంచాలా ఏంటి” అన్న డైలాగ్‌ను ఇమిటేట్ చేస్తూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో రౌడీ హీరో చెప్పిన డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. “ఇంకొకరు స్టార్ అయితే మనం అవ్వలేమా ఏంటి? నేనైతే మీరు అవ్వలేరా ఏంటి?” అంటూ ఆడియన్స్ ను ఉద్దేశించి మాట్లాడాడు. స్టార్ కాలేదన్న బాధ విజయ్ కి ఉండిపోయిందని, అందుకే ఎప్పుడు ఇలా స్టార్స్ మీద పడుతూ ఉంటాడు అంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా, ట్రోలింగ్ దాడులు ఎన్ని జరిగినా రౌడీ హీరో మాత్రం మారడు. స్టార్ కాలేకపోయానే అన్న బాధను ప్రతిసారి వెళ్ళగక్కుతూనే ఉంటాడు. హీరో వ్యాఖ్యలు డైరెక్ట్ గా స్టార్స్ కు వెళ్లి తగులుతాయి. వాళ్ళ ఫ్యాన్స్ ఏమో ట్రోలింగ్ కు పని చెప్తారు. అక్కడితో ఆగకుండా రివ్యూలు అంటూ విజయ్ సినిమాలను చీల్చి చెండాడతారు. పోనీ హీరో హిట్ తో అందరి నోళ్ళు మూయిస్తాడు అనుకుంటే అది లేదు. సక్సెస్ చూసి ఎనిమిదేళ్ళు అయింది. హిట్టే అన్నింటికీ సమాధానం అని గ్రహిస్తే ఈ ట్రోలింగ్ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఏం మాట్లాడితే ఏమవుతుంది? ఎలా పోయి ఎలా వస్తుంది? అన్న భయం విజయ్ దేవరకొండకు లేదు. ఈ క్రమంలో చాలా మంది స్టార్ హీరోల ఫ్యాన్స్ కు దూరమయ్యాడు ఈ రౌడీ హీరో. విజయ్ తో సినిమా అంటే కాంట్రవర్సీలో ఇరుక్కున్నట్లే అన్నంతగా సీన్ మారిపోతోంది. రౌడీ హీరో మాటలు సినిమాకొచ్చిన హైప్ ను డమాల్ అని పడేస్తాయి. విజయ్ మాటలు స్టార్ ఫ్యాన్స్ ను ఇబ్బంది పెడుతున్నాయే కానీ ఈ రౌడీ హీరోతో నిర్మాతలకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ లో నిర్మాత మైత్రి రవి విజయ్ పై ప్రశంసలు కురిపించాడు. “చాలా మంచి అబ్బాయి” అంటూ కితాబు ఇచ్చారు. విజయ్ ఎంతటి డైరెక్టర్, హీరో అయినా, నిర్మాత ‘హీరో’ అనిపించుకున్నా “నేనింతే” అంటూ గిరి గీసి కూర్చోకుండా తనని తాను మార్చుకుని ఎప్పుడు అందరివాడు అవుతాడో మరి!
తాజావార్తలు
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!