Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: “అసలు మన దేశం మొత్తం తెల్లోళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయినప్పుడు.. ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ? మేము కూడా వస్తున్నామా మీ ఊర్లోకి.. మెడ నుండి మొల్లకు నిలువునా నరుకుతాం కొడకల్లారా’ అని ప్రతి ఒక్కడూ గర్జించి ఉంటే, అప్పుడే వాళ్లను తన్ని తరిమేసేవాళ్లం!” అంటూ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ విసిరిన పవర్ ఫుల్ డైలాగ్ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పీరియాడిక్ వార్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేడుకలో విజయ్ పలికిన సీమ యాస మాటలు యావత్ సినీ వర్గాలను ఉర్రూతలూగిస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అనంతరం వేదికపై మాట్లాడిన విజయ్ దేవరకొండ.. బ్రిటీష్ పాలకుల అణచివేతపై మాట్లాడుతూ తెల్లదొరల ఆగడాలపై ఆ కాలంలో మనవాళ్లు చూపించిన తెగువను గుర్తుచేస్తూ ఊగిపోయారు. ఆ వెంటనే సినిమాలో తను చెప్పిన అత్యంత పవర్ఫుల్ డైలాగ్‌ను గుర్తుచేస్తూ “సింగనమల బొబ్బిలి రణబాలిరా నీ అక్క!” అంటూ మైక్‌లో గర్జించడంతో ఆ ప్రాంగణం మొత్తం ఈలలు, అరుపులతో మార్మోగిపోయింది. బ్రిటీషర్ల గుండెల్లో నిద్రపోయే ఒక విప్లవ వీరుడిగా విజయ్ నటన ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్లో ఉండబోతోందని ఈ ఒక్క సీన్‌తో తేలిపోయింది.
మన చరిత్ర పుస్తకాల్లో కొందరి పేర్లను మాత్రమే లిఖించి, నిజమైన యోధులను ఎలా విస్మరించారో విజయ్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. “మనకు ఏ చరిత్ర తెలియకుండా దాచేశారో.. బుర్రకథలు, జానపదాల్లో మాత్రమే మిగిలిపోయిన మన విప్లవ వీరుల పేర్లను ప్రపంచానికి చాటిచెప్పే ప్రయత్నమే ఈ ‘రణబాలి’. ఆనాటి తీవ్ర కరవు నేపథ్యం, సింగనమల గడ్డ పోరాటం, మన పూర్వీకుల రక్తం మనలో ఎలా ప్రవహిస్తోందో చూపించే అద్భుతమైన కథ ఇది. తెలుగు సినీ చరిత్రలోనే అత్యుత్తమ స్క్రిప్ట్‌లలో ఒకటిగా ఇది నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. ఈ వేడుకకు హీరోయిన్ రష్మిక మందన్న (జయమ్మ) షూటింగ్ వల్ల రాలేకపోవడంతో, విజయ్ స్వయంగా స్టేజ్ పైనుంచే ఆమెకు కాల్ చేసి ఆకట్టుకున్నారు. నా కెరీర్‌తో పాటు రష్మిక ఫిల్మోగ్రఫీలో కూడా ఇది చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అని ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ యాసలో బ్రిటీషర్ల వెన్నులో వణుకు పుట్టించిన సింగనమల బొబ్బిలి ‘రణబాలి’గా విజయ్ దేవరకొండ రాబోయే దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలోకి అడుగుపెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ చెప్పిన డైలాగ్ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read
- Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న 'రణబాలి' ట్రైలర్!
- Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
- Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
- SS Rajamouli: బాహుబలి ‘కిలికి’ని మించేలా జక్కన్న సరికొత్త ప్రయోగం?
తాజావార్తలు
-
Vijay Deverakonda: ‘ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ’.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
-
Ranabali Trailer: తెల్లదొరల గుండెల్లో సింగనమల బొబ్బిలి నిప్పులు.. గూస్బంప్స్ తెప్పిస్తున్న ‘రణబాలి’ ట్రైలర్!
-
Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!