Site icon NTV Telugu

Vijay Deverakonda : బాక్సాఫీస్ హిట్ కొట్టిన .. విజయ్ కి తప్పని తిప్పలు

Vijay Devarakonda

Vijay Devarakonda

రీసెంట్ గా ‘కింగ్‌డమ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న విజయ్, రాహుల్ సాంకృత్యన్ డైరెక్షన్‌లో ఇప్పుడు తన నెక్స్ట్ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. కథ, టెక్నికల్ టీమ్ బలంగా ఉంటే విజయ్ మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టగలడు అనే నమ్మకంతో రాహుల్ స్క్రిప్ట్‌ను మరింత స్ట్రాంగ్‌గా తయారు చేస్తున్నాడట. అతని గత చిత్రం ‘శ్యామ్ సింగ రాయ్’ లోనూ విజువల్ ప్రెజెంటేషన్, ఎమోషన్ మిక్స్ బెస్ట్‌గా ఉండటం చూసిన విజయ్‌కి, నమ్మకం వచ్చినట్టు టాక్. ఇప్పుడు కూడా అదే మేజిక్ ఇక్కడ కూడా రిపీట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట.

Also Read : Kaithi 2 : ‘ఖైదీ 2’ పై లోకేష్ కనగరాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

త్వరలోనే టైటిల్, కథా నేపథ్యంలో అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశముంది. అయితే ఈ మూవీ కోసం తొలుత భారీ బడ్జెట్‌ను అనుకున్నారట. కానీ, ఆయన సినిమాలకు జరుగుతున్న నాన్-థియేట్రికల్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే, అంత బడ్జెట్ పెట్టడం రిస్క్ అవుతుందేమో అని మేకర్స్ భావిస్తున్నారట. ‘కింగ్‌డమ్’ బాక్సాఫీస్ వసూళ్లు ఊహించినంత స్థాయిలో రాలేదు. ముఖ్యంగా నాన్-థియేట్రికల్ మార్కెట్‌లో ఈ సినిమా రేట్లు చాలా మితంగా ఉన్నాయట. ఈ గణాంకాలు చూసిన నిర్మాతలు విజువల్స్, స్టార్ క్యాస్టింగ్, ప్రమోషన్ ఖర్చుల విషయంలో మళ్లీ ఆలోచించాల్సిన పరిస్థితి ఎదురైంది. అందుకే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ విషయంలో వారు ఆలోచనలో పడ్డార. ఈ లెక్కన ముందు అనుకున్న దానికంటే తక్కువ బడ్జెట్‌తో విజయ్ సినిమా రూపొందనుందట. మరి ఈ విషయం పై మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Exit mobile version