టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, రష్మిక వ్యవహారం గత కొన్ని నెలలుగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ గీతాగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే డియర్ కామ్రేడ్ లో కేవలం విజయ్ కోసమే ముద్దు సీన్ లో నడిచిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల రష్మిక హైదరాబాద్ వస్తే విజయ్ దేవర కొండ ఇంట్లోనే ఉంటుంది. ఏదైన పండుగ వస్తే రౌడీ బాయ్ ఫామిలీ తో కలిసి సెలెబ్రేట్ చేస్తోంది దాంతో వీరీ ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలకు ఊతం ఇచ్చినట్టైంది. ఇక తాజాగా విజయ్ దేవరకొండ సాహిబా అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించాడు. ఆ ఆల్బమ్ రిలీజ్ అయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రేమ గురించి విజయ్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read : Barroz : మోహన్ లాల్ దర్శకత్వం వహించిన తొలి సినిమా ట్రైలర్ రిలీజ్
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ..” ప్రేమ అనేది అందరికి తప్పక పుడుతుంది. అబ్బాయిలు మీరు ఇంకా యంగ్ గానే ఉన్నారు. కాబట్టి ఇంకాస్త సమయం ఇవ్వండి. బాయ్స్ అన్నిటికంటే ముందు జీవితంలోనే కాదు మీరు ఆలోచన విధానంలో కూడా ఎదగడం నేర్చుకోండి. అదేం తప్పు కాదు కదా. ముఖ్యంగా 30 ఇయర్స్ దాటిన బాయ్స్ , 20 ఏళ్ల వయసు ఉన్న వారి కంటే కూడా బెటర్ గా థింక్ చేస్తారు. ఆ వయసు ఉన్నప్పుడు ఆలోచనలు ఏవి స్థిరంగా ఉండవు. ఏది కూడా డిసైడ్ అవలేము. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే టైమ్ కోసం ఎదురుచూడండి. దేనిని కూడా ఫోర్స్ చేయకండి” అని అన్నారు. ఈ కామెంట్స్ రష్మిక తో లవ్ అనుభవం వల్లే వచ్చాయని, ఆమెతో లవ్ కన్ఫామ్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు