సౌత్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష గురించి పరిచయం అక్కర్లేదు. తెలుగులో ఈ బ్యూటీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. నార్మల్ గా చెప్పాలి అంటే హీరోయిన్ ల కెరీర్ ఇండస్ట్రీలో తక్కవ కాలం ఉంటుంది. కానీ త్రిష మాత్రం దాదాపు 22 ఏళ్లుగా హీరోయిన్‌గా నటిస్తోంది. టాలీవుడ్ లో దాదాపు అందరు స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్‌ల సరసన నటించి మెప్పించిన ఈ చిన్నది. మధ్యలో కొంత బ్రేక్ ఇచ్చింది. తిరిగి ఇటీవల తమిళ ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, తన అంద చందాలతో యంగ్ హీరోయిన్ లకు గట్టి పోటీ ఇస్తోంది. చేతినిండా ప్రాజెక్ట్స్ తో అది కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ ఒక హీరో పై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవ్వరా హీరో అంటే ‘నేను దళపతి విజయ్ కి ప్రత్యేక అభిమానిని. ఆయన ఎప్పటికీ నాకు ప్రత్యేకమే.విజయ్ చాలా లవ్వబుల్ పర్సన్, అతనితో పని చేయడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది’ అంటూ విజయ్‌ని ఆకాశానికెత్తేసింది త్రిష. ఇక వీరిద్దరూ కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఇటీవల ‘లియో’ సినిమాల్లో నటించగ. అలాగే విజయ్ నటించిన ‘గోట్’ సినిమాలో త్రిష స్పెషల్ సాంగ్ చేసింది. అంతే కాదు విజయ్ మూవీస్ లో ఎలాంటి ఆఫర్ వచ్చిన కూడా నో చెప్పదట త్రిష. ప్రస్తుతం ఈ అమ్మడు మాటాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.