విజయ్ ఆంటోనీ గురించి పరిచయం అక్కర్లేదు.డబ్బింగ్ చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న కోలీవుడ్ హీరోలలో అతనొకడు. హీరోగానే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ గా, నిర్మాతగా, లిరిసిస్ట్‌గా, డైరెక్టర్‌గా, ఎడిటర్‌గా మల్టీటాలెంటెడ్ అనిపించుకున్నాడు విజయ్. ‘సలీం’ మూవీతో తెలుగు ఆడియన్స్‌కు దగ్గరైన విజయ్.. ‘బిచ్చగాడు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత వరుస సినిమాలు చేసినప్పటికీ ఆ రేంజ్ సక్సెస్ అందుకోలేకపోయారు. ఇప్పుడు తన కెరీర్‌లో 25వ చిత్రంగా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Also Read : Kareena kapoor : అనవరంగా జనాల కోసం ఇరికించొద్దు..
అరుణ్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ తెలుగులో ‘భద్రకాళి’, తమిళ్ లో ‘శక్తి తిరుమగన్’ అనే టైటిల్ తో రాబోతుంది. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ రాగా లేటెస్టుగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు.. ‘పిల్లి కూడా ఒక రోజు పులి అవును.. అబద్ధం, అహంకారం అంతం అవును’ అంటూ ప్రారంభమైన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇందులో ఒక గ్యాంగ్ స్టర్‌గా, మోసగాడిగా, ఫ్యామిలీ మ్యాన్ గా, గవర్నమెంట్ ఆఫీసర్ గా, ఖైదీగా.. ఇలా రకరకాల కోణాల్లో హీరో ని చూపించారు. కానీ అసలు సినిమాలో అతని పాత్ర ఏంటనేది అర్థం కాకుండా, కథ ఏంటనేది హింట్ ఇచ్చేలా టీజర్‌ను కట్ చేసారు. మరి ఈ మూవీ తో అయిన విజయ్ మంచి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి.