Site icon NTV Telugu

MEGA 157 : మన శంకరవరప్రసాద్ సెట్స్ లో అడుగు పెట్టిన పెళ్లికాని ప్రసాద్

Mega 157

Mega 157

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న చిత్రం మన శంకర వరప్రసాద్. లేడి సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావిపూడి సినిమా కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ చిత్రాల నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి  మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Also Read : Nani : పక్కింటి అబ్బాయితో పూజా హెగ్డే.. ఆశ నెరవేరుస్తాడా?

కాగా ఈ సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకీ కూడా నటిస్తున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తూ ఈ రోజు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్. ఇటీవల సెట్స్ లో అడుగు పెట్టిన వెంకీ మామపై ఓ ప్రోమో రిలీజ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న విక్టరీ వెంకీ, మెగాస్టార్ చిరు ఓకే సినిమాలో కలిసి నటించలేదు. ఇప్పుడు ఈ ఇద్దరినీ ఒకే సినిమాలో చూపిస్తున్నాడు సూపర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. మనశంకర వరప్రసాద్ సెట్స్ లో అడుగుపెట్టిన వెంకీకి స్వాగతం పలుకుతూ ‘ వెల్కమ్ వెంకీ మై బ్రదర్ అని చెప్పగా మై డియర్ చిరు మై బాస్ అని వెంకటేష్ డైలాగ్ తో భీమ్స్ సూపర్ మ్యూజిక్ తో వచ్చిన గ్లిమ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భారీ అంచనాలతో వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

 

Exit mobile version