NTV Telugu Site icon

యూరప్ లోకి నో ఎంట్రీ! విక్కీ కౌశల్ భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మరింత ఆలస్యం…

బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ అవాంతరానికి గురైంది…

కొన్నాళ్ల క్రితం ఆదిత్య దర్, విక్కీ కౌశల్ సహా ‘అశ్వథ్థామ’ మూవీ టీమ్ అంతా జూలైలో యూరప్ బయలుదేరతారని టాక్ వినిపించింది. కానీ, లెటెస్ట్ అప్ డేట్ ప్రకారం క్రూ మెంబర్స్ కి ఇంకా అనుమతులు లభించలేదట. వీసా సమస్యలతో యూరప్ ప్రయాణం ఆగస్ట్ మధ్య వరకూ వాయిదా పడింది. అయితే, మొదట దర్శకుడు ఆదిత్య దర్ యూరప్ వెళతాడని కొందరంటున్నారు. ఆయన యూరప్ లో లొకేషన్స్ కోసం రెక్కీ నిర్వహించాక విక్కీ కౌశల్ తో పాటూ ఇతరులు కూడా ఆగస్ట్ లో ఫ్లైట్ ఎక్కుతారు.

ఆదిత్య దర్, విక్కీ కౌశల్ గత చిత్రం ‘యురి’ భారీ బ్లాక్ బస్టర్ అవ్వటంతో వారి కాంబినేషన్ లోనే వస్తోన్న ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’పై కూడా చాలా అంచనాలున్నాయి. ఇక ‘యురి’లో హీరోయిన్ గా నటించిన యమీ గౌతమ్ నే ఈ మధ్య డైరెక్టర్ ఆదిత్య దర్ పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే…