Arasan: డైరెక్టర్ వెట్రిమారన్ మైండ్ బ్లోయింగ్ లీక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arasan: కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్ – స్టార్ హీరో శంబు కాంబో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘#Arasan’ గురించి ఒక సెన్సేషనల్ అప్డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. రా అండ్ రస్టిక్ సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన వెట్రిమారన్, ఈ సినిమా కోసం ఒక పవర్ఫుల్ బ్యాక్‌డ్రాప్‌ను రెడీ చేసినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ వెట్రిమారన్ తన కెరీర్ స్టార్టింగ్‌లో ధనుష్‌తో తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘పొల్లాదవన్’ షూటింగ్ స్టార్ట్ కాకముందే ఈ ‘#Arasan’ కథను రాసుకున్నారట. అప్పట్లోనే స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ, ఇన్నాళ్లకు ఈ మైండ్‌బ్లోయింగ్ సబ్జెక్ట్ పట్టాలెక్కుతుండటంతో ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ భారీ యాక్షన్ డ్రామా పూర్తిగా నార్త్ చెన్నై నేపధ్యంలో సాగనుందని సమాచారం. తన పాత్రల కోసం ప్రాణం పెట్టే హీరో శింబు, ఈ సినిమాలో సరికొత్త నటనతో మెప్పించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన మూడు విభిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. కథలోని విభిన్న కాలక్రమాలకు అనుగుణంగా శింబు మేకోవర్ ఉండబోతోందని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్. వెట్రిమారన్ మార్క్ ఇంటెన్స్ స్క్రీన్‌ప్లే, నార్త్ చెన్నై రస్టిక్ బ్యాక్‌డ్రాప్, దానికి తోడు శింబు త్రిపాత్రాభినయం లాంటి షేడ్స్.. ఇవన్నీ చూస్తుంటే ‘#Arasan’ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి కూడా ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని కలైపులి ఎస్ థాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అధికారికంగా వెలువడనున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Iran-US War: ఇరాన్ కొత్త ప్లాన్.. ఈసారి టార్గెట్ ఈ దేశాలేనా..!
-
Prabhas : ప్రభాస్- ఓం రౌత్ .. అంతా ఒట్టిదే
-
Mahua Moitra: కోర్టు విచారణకు డుమ్మా.. మహువా మొయిత్రాపై అరెస్ట్ వారెంట్ జారీ
-
Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
-
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్‌లో ఆ 22 నిమిషాలు.. పాక్ స్పందించేలోపే సుఖోయ్ దాడి పూర్తి!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!