ప్రముఖ సినీనటి జయంతి ఈరోజు కన్నుమూశారు. గత రెండేళ్లుగా ఆమె శ్వాససంబంధమైన రుగ్మతతో బాధపడుతున్న జయంతి ఈరోజు మృతి చెందారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో సుమారుగా 500 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆదివారం రాత్రి బెంగళూరులోని బనశంకరీలోని తన నివాసంలోనే ఆనారోగ్యం కారణంగా మృతి చెందారు. 1968లో జైగూండు చిత్రంలో చిత్ర పరిశ్రమకు జయంతి పరిచయం అయ్యారు. 190 కన్నడ చిత్రాలతో సహా మొత్తం 500 లకు పైగా చిత్రాల్లో నటించారు. మిస్ లీలావతి చిత్రంలోని నటనకు ఆమెకు జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఇక కన్నడ చిత్రపరిశ్రమ ఆమెకు అభినయ శారదే అనే బిరుదుతో సత్కరించింది. జయంతి మృతిపట్ల జాతీయ చిత్ర పరిశ్రమ సంతాపం తెలియజేసింది.
ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత…
