కమెడియన్ నుండి దర్శకుడిగా మారాడు ఎల్దండి వేణు. తోలి ప్రయత్నంలోనే నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో వేణు తెరకెక్కించిన ‘బలగం’మూవీ సూపర్ హిట్ సాధించింది.బలగం సక్సెస్ అవడంతో రెండవ సినిమా కూడా తన బ్యానర్ లో చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చాడు దిల్ రాజు. అదునులో భాగంగా నేచురల్ స్టార్ నానికి వేణు ఓ కథను నెరేట్ చేశారు. మార్పులు చేర్పులు చేస్తూ కొన్నాళ్లు పాటు నడిచిన ఈ వ్యవహారం ఆ తర్వాత ఆగింది. ఎందుకనో వేణుతో ప్రాజెక్ట్ చేయటానికి నాని సుముఖంగా లేడు.
Also Read: Big Boss: తమిళ బిగ్ బాస్ సీజన్ – 8 హోస్ట్ ఫిక్స్.. కండిషన్స్ అప్లై?
దీంతో ఇప్పుడు ‘బలగం’ వేణు మరో హీరోని వెతుక్కునే పనిలో పడ్డారు. అందులో భాగంగా ఇద్దరు హీరోలకు ఆయన కథ నెరేట్ చేశారు. వారిలో ఒకరు నితిన్, మరొకరు విశ్వక్‌సేన్. ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో రాబిన్ హుడ్ఈ, వేణు శ్రీరామ్ తో తమ్ముడు సినిమాలో నటిస్తున్నాడు. సో నితిన్ ఇప్పుడే దొరకడు. ఇక మరొక హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆ నాలుగు సినిమాల షూటింగ్ లో ఫుల్ల్ బిజీగా ఉన్నాడు. వాటిలో మెకానిక్ రాకీ సినిమాను ఈ నెల 31న రిలీజ్ చేస్తున్నాడు. వేణు చెప్పిన కథకు విశ్వక్ నచ్చినా కూడా సినిమా చేయలేని పరిస్థితి. బలగం వంటి హిట్ తర్వాత వేణు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాడు. బడా నిర్మాత చేతిలో ఉన్నా కూడా వేణుకి ఎందుకనో హీరోదొరకడం లేదు. మరి వేణు ఈ ద్వితీయ యజ్ఞం ఎప్పుడు దాటతాడో ఏ హీరో అవకాశం ఇస్తాడో