Site icon NTV Telugu

Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!

Vennela Kishore

Vennela Kishore

“వెన్నెల” అనే సినిమాతో సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, ఆ సినిమానే తన ఇంటిపేరుగా మార్చేసుకున్నాడు. అందులో ఒక కామెడీ క్యారెక్టర్‌తో ఆయన అందరినీ నవ్వించాడు. ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఒక స్టార్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే ఇలా ఒక స్టార్ కమెడియన్‌గా ఉన్నప్పుడే ఆయన “వెన్నెల వన్ అండ్ హాఫ్”, “జఫ్ఫా” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Read More:Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !

అయితే ఈ రెండు సినిమాలు దారుణంగా డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న వెన్నెల కిషోర్‌ని “మళ్లీ ఎప్పుడు మీరు మెగాఫోన్ పట్టుకుంటారు?” అని ప్రశ్నిస్తే, దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతానికి తనకు దర్శకత్వం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పుకొచ్చాడు. “ఇక మోకాళ్లు పట్టేసి నేనింకా నడవలేను అనుకుంటున్న పరిస్థితుల్లో, మంచి రైటింగ్ టీం‌ని పెట్టుకుని అప్పుడు డైరెక్షన్ చేస్తాను. ప్రస్తుతానికి నటుడిగా నేను చాలా బిజీగా, హ్యాపీగా ఉన్నాను” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.

Read More:#Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!

ఇక శ్రీ విష్ణు హీరోగా నటించిన “సింగిల్” సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ బాగా వర్కౌట్ అయింది. శ్రీ విష్ణుతో కలిసి వెన్నెల కిషోర్ చేసిన అల్లరి తెరమీద ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ సినిమా ప్రమోషన్స్‌లో కూడా పాల్గొంటున్నాడు.

Exit mobile version