“వెన్నెల” అనే సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన కిషోర్, వెన్నెల కిషోర్‌గా ఇప్పుడు టాప్ కమెడియన్ హోదా అనుభవిస్తున్నాడు. అయితే కొద్ది రోజుల క్రితం వరకు వెన్నెల కిషోర్ సినిమా ప్రమోషన్స్‌కి రాడు అనే ఒక మరక ఉండేది. ఇప్పుడు ఆ మరక తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా “సింగిల్” సినిమా ప్రమోషన్స్‌లో కూడా ఆయన పాల్గొన్నాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేశాడు.
Also Read:Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన సందర్భంగా, ఒకప్పుడు ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేవారు. “బ్రహ్మ ఆనందం” అనే సినిమా నుంచి కాస్త మీడియా ముందుకు వస్తున్నారు. “ఎందుకు మీలో ఈ మార్పు?” అని అడిగితే, ఆయన దానికి ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు. “నిజానికి అంతకు ముందు వరకు నేను ప్రమోషన్స్‌లో పాల్గొనకపోయినా జనాలు థియేటర్లకు వస్తారని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను కూడా బయటకు వచ్చి నా వంతు ప్రమోషన్ చేయడం చాలా ముఖ్యం. అయితే అంతకుముందు నేను షూటింగ్ డేట్స్ కారణంగా ప్రమోషన్స్‌కి హాజరు కాలేకపోయేవాడిని.
Also Read:#Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!
ఎందుకంటే సాధారణంగా ఇంటర్వ్యూలు ఉంటే ఉదయం 10 తర్వాతే ఉంటాయి. 10 తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకు నా డేట్స్ వేరే సినిమాకి ఇచ్చేసి ఉంటాను. పోనీ సాయంత్రం జరిగే ఈవెంట్స్‌కి రావాలన్నా, వాళ్లు 6:30 తర్వాత గానీ నన్ను వదలరు. అప్పుడు నేను వస్తే లేట్ అవుతుంది అనే మరో అపవాదు కూడా ఉంటుంది. కాబట్టి అసలు ప్రమోషన్స్‌కి దూరంగా ఉండేవాడిని. అలాగే నేను చాలా ఇంట్రోవర్ట్. ఏదైనా ఒక ఈవెంట్‌లో ఎవరి గురించైనా మాట్లాడటం మరచిపోతే, వాళ్లు ఏమనుకుంటారో అని మదనపడాల్సి వచ్చేది. దానికన్నా అసలు ఆగిపోతే బెటర్ కదా అనే నిర్ణయంతో ఎన్నాళ్లో ఆగిపోయాను. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటకి రావాలని అర్థం చేసుకుని నా అంతట నేనే వస్తున్నాను. ఇక మీదట కూడా వచ్చే ప్రయత్నం చేస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
