Site icon NTV Telugu

Vennela Kishore: నేను హీరో అని నాకే తెలియకుండా సినిమా తీశారు!

Srikakulam Sherlock Holmes

Srikakulam Sherlock Holmes

తాను హీరో అని తనకే తెలియకుండా ఒక సినిమా చేసినట్లు వెన్నెల కిషోర్ చెప్పుకొచ్చాడు. అసలు విషయం ఏమిటంటే, వెన్నెల కిషోర్ కీలకపాత్రలో “శ్రీకాకుళం షర్లాక్ హోమ్స్” అనే సినిమా రూపొందింది. ఈ సినిమాలో హీరో వెన్నెల కిషోర్ అని ముందు నుంచి సినిమా టీం చెబుతూ వచ్చింది. అంతేకాక, వెన్నెల కిషోర్ ప్రమోషన్స్‌కి ఎందుకు రాలేదు అంటే, అది ఆయన్ని అడగాలంటూ కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయింది.

Also Read: Vennela Kishore : అప్పటిదాకా డైరెక్షన్ చేయను!

ఈ విషయం మీద వెన్నెల కిషోర్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ, “నాకు నేను ఈ సినిమాలో హీరో అనే సంగతి తెలియదు. నాకు ముందుగా సినిమా కథ మొత్తం చెప్పలేదు. ఈ మధ్య నేను అలా అడగడం కూడా మానేశాను. ఎందుకంటే కొంతమంది కథ మొత్తం అడిగితే ఫీల్ అవుతున్నారు. కాబట్టి నా వరకు ట్రాక్ చెప్పమన్నాను, చెప్పారు. ఏడు రోజుల డేట్స్ ఇచ్చాను, షూట్ చేశాను. తర్వాత ఇంకొన్ని ఎమోషనల్ సీన్స్ యాడ్ చేయాలన్నారు. వెళ్లి నటించి వచ్చాను.

Also Read:Vennela Kishore : బ్రహ్మానందం వారసుడు అన్నది ఒప్పుకోను!

సినిమా రిలీజ్ సమయంలో నేను హీరో అని పోస్టర్ వేస్తే ఆశ్చర్యపోయాను. అసలు నాకే తెలియకుండా నన్ను హీరోగా ఎలా చేశారో అర్థం కాలేదు. నాకు ముందు చెప్పినప్పుడు ఆ సినిమాలో వేరే హీరో ఉన్నాడు, అతనికి జంటగా అనన్య నాగాళ్ల నటిస్తుందని చెప్పారు. కానీ చివరికి నన్ను హీరోగా చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇది నాకు తెలియకుండా జరిగింది. ముందే నాకు దర్శక నిర్మాతలు నేనే హీరోనని చెప్పి ఉంటే, అప్పుడు నేను ప్రమోషన్స్‌కి కూడా వచ్చి ఉండేవాడినేమో” అంటూ ఆయన మాట్లాడారు.

Exit mobile version