Site icon NTV Telugu

#Single: ‘సింగిల్’లో వెన్నెల కిషోర్ హీరో అంటే రియాక్షన్ ఇదే!

Vennela Kishore

Vennela Kishore

శ్రీ విష్ణు హీరోగా రూపొందిన “సింగిల్” సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాలో శ్రీ విష్ణుతో పాటు ఫుల్ లెంగ్త్ రోల్ చేశాడు వెన్నెల కిషోర్. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ కూడా ఈ సినిమాలో ఒకానొక హీరో అని ప్రస్తావన రివ్యూస్‌లో ఎక్కువగా కనిపించింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియాతో ముచ్చటించిన వెన్నెల కిషోర్‌తో ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే, అది నిజం కాదని అన్నాడు.

Read More: Deepthi Ghanta: నువ్వు సినిమాల్లో సర్వైవ్ అవ్వలేవని ముందు అన్నది నేనే.. నాని సోదరి కీలక వ్యాఖ్యలు !

ఈ సినిమా హీరో శ్రీ విష్ణు అని తాను ఈ సినిమాలో ఒక సైడ్ క్యారెక్టర్ లాంటిది చేశానని అన్నారు. కానీ “మీ గురించి రివ్యూస్‌లో ఇలా ప్రస్తావన వస్తోంది కదా” అంటే, “ఏదైనా బిర్యాని బుక్ చేసినప్పుడు అందులో ఒక మంచి లివర్ పీస్ కూడా వస్తుంది. ఆ లివర్ పీస్ వచ్చినంత మాత్రాన, అసలు ఈ లివర్ పీస్ లేకపోతే బిర్యాని బాగోదు అని అనడం కరెక్ట్ కాదు. నేను ఈ సినిమాలో లివర్ పీస్ లాంటివాడిని” అంటూ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చాడు వెన్నెల కిషోర్. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ అరవింద్ అనే క్యారెక్టర్‌లో అవుట్ అండ్ అవుట్ కామెడీ పుట్టించాడు. ఈ నేపథ్యంలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ మీద ప్రశంసల వర్షం కురుస్తోంది. సింగిల్ లైనర్స్, తనదైన కామెడీ టైమింగ్‌తో వెన్నెల కిషోర్ శ్రీ విష్ణుతో అలరించాడని చెప్పొచ్చు.

Read More:Pakistani Drone Strike: పౌరులే లక్ష్యంగా పాకిస్తాన్ దాడి.. భారీగా ఇళ్ళు, కార్లు ధ్వంసం!

Exit mobile version