మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కథానాయకుడిగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రానికి నిర్మాతలు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు. దీపావళి కానుకగా 2024 అక్టోబర్ 31వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల అయిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
Also Read : SIGMA : జాసన్ సంజయ్ సిగ్మా.. షూటింగ్ ఫినిష్.. టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
దుల్కర్ సల్మాన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచి రూ. 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది లక్కీ భాస్కర్. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఈ చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకుంది. సూర్య సినిమా ఫినిష్ చేసి ఆ వెంటనే లక్కీ భాస్కర్ కు సీక్వెల్ కథ, కథనాలపై ద్రుష్టిపెట్టాలని వెంకీ అట్లూరి ప్లానింగ్ చేస్తున్నారట. లక్కీ భాస్కర్ క్లైమాక్స్ లో హీరో తన సంపందనను మొత్తం అధికారుల కంటపడకుండా విదేశాలకు తరలించి అక్కడ సెటిల్ అవుతాడు. మరి లక్కీ భాస్కర్ సీక్వెల్ ను ఎక్కడ నుండి మొదలు పెడతారో చూడలి. అన్ని అనుకున్నట్టు జరిగితే లక్కీ భాస్కర్ ఈ సారి కొత్త సమస్యలు, వాటి నుండి తప్పించుకునే ప్రణాళికలతో 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
