NTV Telugu Site icon

Venkatesh – Ravipudi: మాజీ పోలీసు అధికారిగా వెంకటేష్ – పొల్లాచ్చిలో బిజీ బిజీ!

Venkatesh

Venkatesh

Venkatesh – Ravipudi: విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో ఒక మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని ఈ కొత్త సినిమాతో సిద్ధం అవుతున్నారు. సంక్రాంతి రేసులో ఉన్న ఈ ఎస్వీసీ ప్రొడక్షన్ నెం. 58 పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా విక్టరీ వెంకటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా వెంకటేష్‌ను మాజీ కాప్‌గా ప్రెజెంట్ చేస్తూ మేకర్స్ స్పెషల్ వీడియోను సైతం విడుదల చేశారు. వెంకటేష్ – అనిల్ రావిపూడి సెట్‌లో సరదాగా గడిపిన సమయాన్ని వీడియోలో చూపించారు. ఈ నెల రోజుల షెడ్యూల్లో మొత్తం టాకీ పార్ట్‌లు, పాటల షూటింగ్‌పై టీమ్ దృష్టి పెట్టింది.

Also Read: CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?

హీరో, అతని మాజీ ప్రియురాలు, అతని భార్య అనే మూడు ప్రధాన పాత్రల సంక్లిష్ట సంబంధాలను అన్వేషించే ఈ సినిమా ఒక క్రైమ్ డ్రామాగా ఉంటుందని అంటున్నారు. వెంకటేష్ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తుండగా, సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి అందిస్తున్నారు. యానిమల్ ఫేమ్ ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, మరియు చిట్టి కీలక పాత్రలలో నటించారు.

Show comments