Site icon NTV Telugu

Veera Simha Reddy New Song Launch: సంధ్య థియేటర్లో ‘మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే’

Bala

Bala

Veera Simha Reddy New Song Launch: బాలకృష్ణ తాజా చిత్రం వీర సింహారెడ్డి. షూటింగ్ పూర్తి చేసుకుని సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించాడు. బాలకృష్ణ, శృతి హాసన్, దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2023 జనవరి 12న విడుదల కానుంది.

ఇప్పటికే ఈ సినిమా తాలూకా పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్ ఇలా అన్ని సినిమా ఫై అంచనాలు పెంచేయగా..తాజాగా సినిమాలోని ‘మా బావ మనోభావాలు’ అంటూ సాగే మూడో సాంగ్ ప్రోమో శుక్రవారం రిలీజ్ చేశారు. ఈ పాటను డిసెంబర్ 24న విడుదల చేయనున్నది చిత్ర బృందం. ఇందుకు ఆర్టీసీ క్రాస్ రోడ్డులో ఉన్న సంధ్య థియేటర్ వేదిక కానుంది. సెన్సేష‌ల్ లాంచ్ ఫ‌ర్ ది స్పెష‌ల్ సాంగ్ పేరుతో చేస్తున్న ఈవెంట్‌కు బాల‌య్యతో పాటు హీరోయిన్ శృతిహాసన్ హాజరయ్యే అవకాశం ఉంది. సరికొత్త లుక్ లో అభిమానులను బాలయ్య సర్ ప్రైజ్ చేస్తూ డ్యాన్స్ ఇరగదీశారు. థమన్ సంగీతం, బాలయ్య డ్యాన్స్ తో సాంగ్ టీజర్ కే అభిమానులు ఊగిపోతున్నారు. మరి పూర్తి సాంగ్ వస్తే అభిమానులు ఏంచేస్తారో.. ఎంత రచ్చ చేస్తారో చూడాలి.

Exit mobile version