మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది. కానీ బొమ్మ వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది.
Also Read : Teja Sajja : ప్రభాస్.. ఎన్టీఆర్ తర్వాత తేజా సజ్జా మాత్రమే.. సెన్సేషన్ రికార్డ్
ఇక ఇప్పడు మరొక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు ఉన్ని. భారత ప్రధాని మోడీ బయోపిక్ ఆధారంగా తీయబోతున్న మా వందేలో మోదీ పాత్రలో నటిస్తున్నాడు. ఇటీవల మోదీ బర్త్ డే సందర్భంగా సినిమా టైటిల్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. మా వందే సిల్వర్ కాస్ట్ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మాత వీర్ రెడ్డి అత్యంత భారీ బడ్జెట్ పై భారీ ఎత్తున పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. సీహెచ్ క్రాంతి కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు KGF రవి బ్రసూర్, బాహుబలి డీవోపీ సెంథిల్ కుమార్, సాబు శిరిల్ లాంటి స్టార్ క్రూ వర్క్ చేయబోతున్నారు. ప్రధాని మోదీ జీవిత చరిత్రను నార్త్‌తో పాటు సౌత్ తెలిసేలా ప్లాన్ చేస్తున్నాడు వీర్ రెడ్డి. సినిమాల మీద మక్కువతో అమెరికాలో స్థిరపడిన వీర్ రెడ్డి తానె హీరోగా వీర్ రెడ్డి అనే కోర్ట్ రూమ్ డ్రామా సినిమాలో నటించి మెప్పించారు. ఇప్పుడు నరేంద్ర మోడీ జీవితాన్ని ఎందరికో స్ఫూర్తి కావాలని మా వందే పేరుతో సినిమాను నిర్మిస్తున్నారు వీర్ రెడ్డి.
